Samantha : స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అందుకు నువ్వే కార‌ణం అంటూ..!

July 2, 2022 8:16 PM

Samantha : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచి స‌మంత లైఫ్ ఎంతో బిజీగా మారిపోయింది. త‌ర‌చూ ఏదో ఒక ప‌నిలో బిజీగా ఉంటోంది. ఓ వైపు సినిమా షూటింగ్స్ చేస్తూనే మ‌రోవైపు స‌మ‌యం ల‌భించిన‌ప్పుడ‌ల్లా వెకేష‌న్‌ల‌కు వెళ్తోంది. అలాగే ప‌లు బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను కూడా ఆమె ప్ర‌మోట్ చేస్తోంది. దీంతో ఆమె కేవ‌లం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే నెల‌కు రూ.3 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తోంద‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం స‌మంత వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. అయితే ఈమె ఈ మ‌ధ్య పాల్గొన్న కాఫీ విత్ క‌ర‌ణ్ జోహార్ షోలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం.

కాఫీ విత్ క‌ర‌ణ్ జోహార్ షో అంటేనే వివాదాల‌కు మారుపేరు. ఈయ‌న షో వ‌ల్ల గ‌తంలో విడిపోయిన జంట‌లు ఉన్నాయి. అలాంటి షోకు స‌మంత గెస్ట్‌గా వెళ్ల‌డంతో ఆమె త‌న విడాకుల వ్య‌హారంపై నోరు విప్పి ఉంటుంద‌ని భావించారు. అస‌లు ఆమె విడాకులు ఎందుకు ఇచ్చిందో అందులో చెప్పి ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ షోకు సంబంధించి ప్రోమోను తాజాగా లాంచ్ చేశారు. ఇందులో స‌మంత చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

Samantha comments on Karan Johar viral
Samantha

కాఫీ విత్ క‌ర‌ణ్ జోహార్ షోలో భాగంగా స‌మంత మాట్లాడుతూ.. చాలా మంది వివాహం అయ్యాక సంతోషంగా లేక‌పోవ‌డానికి నువ్వే కార‌ణ‌మ‌ని ఆమె క‌ర‌ణ్ జోహార్‌ను ఉద్దేశించి మాట్లాడింది. అలాగే మీ సినిమాలు చూసి క‌భీ ఖుషీ క‌భీ ఘ‌మ్ లా ఉంటాయ‌ని అంద‌రే అనుకుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం కేజీఎఫ్‌లా ఉంటాయ‌ని స‌మంత మాట్లాడింది. అయితే ఈమె చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ఇక స‌మంత‌, అక్ష‌య్ కుమార్ క‌ల‌సి ఈ షోలో పాల్గొన‌గా.. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో క‌ర‌ణ్ జోహార్ స్వ‌యంగా త‌న ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో ఓ మూవీని తీస్తార‌ని తెలుస్తోంది. ఈ షో సందర్భంగా ఆ మూవీ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. ఈ షో 7వ సీజ‌న్ జూలై 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ప‌లు ఎపిసోడ్ల‌లో ఇత‌ర బాలీవుడ్ స్టార్స్ కూడా సంద‌డి చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment