Samantha : సమంతకు కోలుకోలేని దెబ్బ‌.. సామ్ కెరీర్ ని ఆయన కావాలనే నాశనం చేస్తున్నాడా..?

September 30, 2022 11:08 AM

Samantha : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సమంత సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుండి ఆమె వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ ఎక్కువైంది. మీడియాలో పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతోంది అనే వార్త వైరల్ అవుతుంది. దీని వెనుక ఆధ్యాత్మికవేత్త సద్గురు ఉన్నారట. ఆయనే సమంతను రెండో పెళ్ళికి ఒప్పించారని, ఒక అబ్బాయిని కూడా ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉండగా.. ఏడాదికాలంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకే పరిమితమైన డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం మూవీ ఇటీవలే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2022 నవంబర్ 4న శాకుంతలం సినిమా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే సడన్ గా ఏమైందో ఏమో ఈ మూవీ యూనిట్ రిలీజ్ విషయంలో యూటర్న్ తీసుకుంది. అంతేకాదు సినిమాను త్రీడీలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికే ఇలా చేస్తున్నాం అంటూ ఓ నోట్ ఇచ్చింది. దీంతో శాకుంతలం సినిమా అనుకున్న టైం కంటే లేటుగా వస్తుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.

Samantha bad time her movie release postponed again he is the reason
Samantha

అయితే సమంత సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. బ్యాక్ స్టెప్ వేయడం వెనుక సినీ పెద్దల హస్తం ఉందని టాక్. శాకుంతలం సినిమాని కొందరు పెద్దలు కావాలనే ఆపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా సామ్ మూవీస్ ఏం విడుదల కాలేదు.. ఇప్పుడు ఇది అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేయడం సమంతకు మైనస్ అనే చెప్పాలి. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడమే దీనికి కారణం అని.. కావాలనే అక్కినేని నాగార్జున తన పలుకుబడితో సమంత కెరీర్ ని తొక్కేస్తున్నాడ‌ని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో ప్రస్తుతం నాగార్జున, చైతన్య పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now