Samantha : నాగ చైత‌న్య‌కు దూరంగా.. ఆయ‌న ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌గా.. ఏంటి స‌మంత ఇది..?

April 9, 2022 3:53 PM

Samantha : స‌మంత‌, నాగ చైత‌న్య జంట‌ని చూస్తే ఎంత చూడ ముచ్చ‌ట‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2009లో ఏ మాయ చేశావె చిత్రం సెట్స్‌లో కలుసుకున్న ఈ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. తెరపైనే కాకుండా నిజ‌జీవితంలో కూడా వారి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య, సమంత గురించి టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి.

Samantha away from Naga Chaitanya but close to his family members
Samantha

స‌మంత‌-చైతూ ఎందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచింది వాళ్లు చెబుతూనే ఉన్నారు. మరికొందరు అయితే ఏకంగా డిబేట్స్ పెట్టి.. కచ్చితమైన కారణాలు ఇవే అంటూ కుండ బద్దలు కొడుతున్నారు. సమంత పిల్లలు కనడానికి ఒప్పుకోలేదని.. సరోగసి వైపు అడుగులు వేసినందుకే చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు చెప్తున్న కారణం. పైగా సూపర్ డీలక్స్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 ల‌లో సామ్ ఇంట్లో చెప్పకుండా బోల్డ్‌గా నటించడం వంటివి కూడా కారణాలుగా కనపించాయి. ఏదేమైనా చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత ఆయ‌న‌కు చాలా దూరంగా ఉంటుంది స‌మంత‌. ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్‌ చేసిన సామ్ కొద్ది రోజుల క్రితం అన్‌ఫాలో కూడా చేసేసింది.

అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, రానా, వెంకటేష్‌ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్‌ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది. అంతే కాదు అత‌నికి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు కూడా చెప్ప‌కుండా ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అయితే తాజాగా అఖిల్ బ‌ర్త్ డే కాగా ఆయ‌న ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే అఖిల్‌. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలని దేవుడ్ని కోరుకుంటున్నా.. అంటూ ఫోటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే సమంత పోస్ట్‌పై అఖిల్‌ స్పందించలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment