Samantha : సమంత, నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం ఆమెనా..?

September 17, 2022 10:42 PM

Samantha : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కపుల్స్ గా ఉన్న నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపు ఏడాది గడుస్తోంది. వీరి విడాకుల విషయం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాదు అభిమానుల గుండెల్లో కూడా పెద్ద బాంబు పేలినట్లు అయ్యింది. ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంపై  అభిమానుల్లో ఏదో రకంగా చర్చ జరుగుతూనే ఉంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చై సామ్ పై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత కూడా ఛాన్స్ దొరికితే చాలు అక్కినేని కుటుంబాన్ని ఇన్ డైరెక్ట్ గా విమర్శిస్తూనే ఉంది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట 2017లో వివాహం చేసుకుని గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి విడాకులకు గల అసలు కారణం ఏమిటనేది అభిమానుల‌కు ఇప్పుడు కూడా చిక్కు ప్రశ్నగా మిగిలింది. వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరిపై ఇప్పటికీ వార్తలు ప్రసారం అవుతూనే ఉన్నాయి.  ఎవరికి నచ్చినట్లు  వారు ఊహించుకుని వార్తలు ప్రచురిస్తున్నారు. అన్ని వార్తలు ప్రసారం అవుతున్నా కూడా వీరిద్దరూ ఏమీ జరగనట్లు తమ కెరియర్ గురించి ప్లాన్స్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Samantha and Naga Chaitanya divorced because of her
Samantha

ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సామ్ చైతు గురించి మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. సమంత చైతన్య విడిపోవడానికి అసలు కారణం ఆమె అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. నాగార్జున సొంత సోదరి కుమార్తె అయిన సుప్రియ యార్లగడ్డ వల్లనే సమంత, చైతన్య విడిపోయారని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు.

నాగ చైతన్యకు సుప్రియ వరసకు మరదలు అవుతుంది. వీరిద్దరి మధ్య చిన్నప్పటినుంచి మంచి స్నేహ బంధం ఉంది. దీనితో ఎవరికి తోచినట్లు వారు వార్తలు రాసే పడేస్తున్నారు. దీని కోసం ఓ అద్భుతమైన కథ కూడా అల్లేశారు. సుప్రియ యంగ్ హీరో అడవి శేషు ప్రేమించుకొని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే ముందు నుంచి కూడా సుప్రియకు, సమంతకు పడదు. అందుకే ఈ పెళ్లి జరగకూడదు అని సమంత అడ్డుపడిందని.. అదే శేషుతో దూరానికి కారణమైందని, సమంత చివరకు వాళ్ళ పెళ్లి పెటాకులు అయ్యేలా చేసిందని.. ఈ కారణం వలనే సుప్రియ కూడా ఈ కక్ష మనసులో పెట్టుకుని చైతన్య, సమంత మధ్యలో విభేదాలు వచ్చేలా చేసిందంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వీటిలో నిజం ఎంత ఉంద‌న్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now