గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sai Pallavi : తన ముఖంపై ఉండే మొటిమల గురించి.. అసలు విషయం చెప్పిన సాయిపల్లవి..

Sai Pallavi : ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ.. సాయి పల్లవి. అయితే ఈమె అంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఈటీవీలో ప్రసారం అయిన ఢీ షోలో అప్పట్లో సాయి పల్లవి…

Sai Pallavi : తన ముఖంపై ఉండే మొటిమల గురించి.. అసలు విషయం చెప్పిన సాయిపల్లవి..

Sai Pallavi : ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ.. సాయి పల్లవి. అయితే ఈమె అంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఈటీవీలో ప్రసారం అయిన ఢీ షోలో అప్పట్లో సాయి పల్లవి తన డ్యాన్స్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. తరువాత సినిమాల్లోకి వచ్చింది. ఈమె నటించిన తొలి సినిమా కస్తూరి మాన్. తమిళంలో వచ్చింది. అయితే ఫిదా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయి ఈమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తరువాత కూడా ఈమెకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

తెలుగుతోపాటు మళయాళం, తమిళ భాషలకు చెందిన సినిమాల్లోనూ ఈమె నటిస్తోంది. అయితే సాయి పల్లవి గ్లామర్‌ షోకు దూరం. తాను తన సహజసిద్ధమైన అందాన్నే ఇష్టపడతానని చెప్పింది. అందుకనే తాను ముఖానికి ఎలాంటి క్రీములను రాయనని చెప్పేసింది. ఇక తన కెరీర్‌ మొదట్లో ముఖంపై మొటిమలు బాగా ఉండేవని.. హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారని.. కానీ తన ముఖంపై మొటిమలు ఉన్న కారణంగా భయపడ్డానని.. తనను ప్రేక్షకులు ఏమైనా అంటారేమోనని కంగారు ఉండేదని.. సాయిపల్లవి తెలియజేసింది.

Sai Pallavi told truth about her beauty tips
Sai Pallavi

అయితే తన సినిమాలు చూశాక ప్రేక్షకులు తనను ఆదరించారని సాయిపల్లవి తెలిపింది. దీంతో వారు అందానికి కాకుండా నటనకే ప్రాధాన్యతను ఇస్తారనే విషయాన్ని తెలుసుకున్నానని చెప్పింది. కనుకనే తాను సహజసిద్ధంగా ఉండేందుకే ప్రయత్నిస్తానని తెలియజేసింది. ఇక సాయిపల్లవి ఫెయిర్‌నెస్‌ క్రీములకు చెందిన యాడ్స్‌లోనూ అందుకనే నటించనని చెప్పింది. సహజసిద్ధమైన అందానికే ప్రాధాన్యతను ఇస్తా కనుక తాను అలాంటి యాడ్స్‌ను ఎంత ఇచ్చినా చేయలేనని ఈమె గతంలోనే ఖరాఖండిగా చెప్పేసింది. అందుకనే ఈమెకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే సాయిపల్లవి మొటిమలకు చెందిన విషయం ఇప్పటికీ ఇంకా చాలా మందికి తెలియదు. కానీ దాని వెనుక పైన చెప్పిన విధంగా విషయం చాలానే ఉంది. ఏది ఏమైనా.. ఆమె పాటిస్తున్న విలువలకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి