గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sai Dharam Tej : 35 రోజుల‌కు పైగా అపోలోలో సాయి ధ‌ర‌మ్ తేజ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయ్యిందో తెలుసా !

Sai Dharam Tej : ప్రస్తుతం ఉన్న హైటెక్ టెక్నాలజీ వ‌ల్ల కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి కూడా అదే రేంజ్ లో ఉంది. సామాన్య ప్రజలు కనుక కార్పోరేట్ హాస్పిటల్స్ కు వెళ్తే వాళ్ళ ముత్తాతల ఆస్తులు కూడా…

Sai Dharam Tej : 35 రోజుల‌కు పైగా అపోలోలో సాయి ధ‌ర‌మ్ తేజ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయ్యిందో తెలుసా !

Sai Dharam Tej : ప్రస్తుతం ఉన్న హైటెక్ టెక్నాలజీ వ‌ల్ల కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి కూడా అదే రేంజ్ లో ఉంది. సామాన్య ప్రజలు కనుక కార్పోరేట్ హాస్పిటల్స్ కు వెళ్తే వాళ్ళ ముత్తాతల ఆస్తులు కూడా రాయించేసుకుంటారు. అలాగే సెల‌బ్రిటీల విషయంలో ఎలా ఉంటుందనేది ఇంకా సస్పెన్స్. లేటెస్ట్ గా బైక్ యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలి హాస్పిటల్ లో చేరిన సాయి ధరమ్ తేజ్ 36 రోజులు ఉన్నారు. అయితే సాయి తేజ్ కి ఎంత బిల్ వేసారనే విషయం ఇప్పటి వరకు తెలీదు. సెప్టెంబర్ 10 నుండి సాయి తేజ్ హాస్పిట‌ల్‌లో ఉండ‌గా.. అక్టోబర్ 15వ తేదీన అత‌ని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

Sai Dharam Tej hospital bill for 35 days in care

దాదాపు యాక్సిడెంట్ జరిగిన 10 రోజులు అసలు సాయి తేజ్ హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఎవరికీ తెలీదు. సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ కోమాలోకి వెళ్ళాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతి రోజు వైద్యులు సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేస్తూ మీడియాకి అందించారు. ఎప్పటికప్పుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా వివరిస్తూ వచ్చారు. అలాగే సాయి తేజ్ హాస్పిటల్ లో ఉండగానే ఆయన నటించిన లేటెస్ట్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సినిమాను కూడా రిలీజ్ చేశారు.

సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్లుగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. సాయికి మరో జన్మలాంటిది.. అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడటం అనేది నిజంగా పునర్జన్మ అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సాయి తేజ్ కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. కనుక ఆయన హాస్పిటల్ బిల్ అందులోనే కవర్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎంత బిల్ అయ్యిందనే వార్తలు మాత్రం బయటకు రాలేదు. 35 రోజుల బిల్ సాయి తేజ్ ఇన్సూరెన్స్ పాలసీలోనే కట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తారనే వార్తలు వ‌స్తున్నాయి. అయితే ఉజ్జాయింపు లెక్క‌ల ప్రకారం.. సుమారుగా రూ.5 కోట్ల‌కు పైగానే బిల్ అయి ఉంటుంద‌ని అర్థం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి