గురువారం, జూన్ 11, 2026
వార్తలు

RRR Trailer : రోమాలు నిక్క‌పొడుచుకునేలా ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్.. అంచనాలను అధిగమించేసిన ఎస్‌ఎస్‌ రాజమౌళి..

RRR Trailer : బాహుబ‌లి సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన రాజ‌మౌళి ఇప్పుడు టాలీవుడ్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే మ‌ల్టీ స్టార‌ర్ ను తెర‌కెక్కించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల…

RRR Trailer : రోమాలు నిక్క‌పొడుచుకునేలా ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్..  అంచనాలను అధిగమించేసిన ఎస్‌ఎస్‌ రాజమౌళి..

RRR Trailer : బాహుబ‌లి సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన రాజ‌మౌళి ఇప్పుడు టాలీవుడ్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే మ‌ల్టీ స్టార‌ర్ ను తెర‌కెక్కించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుండ‌గా, చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ట్రైల‌ర్ ను విడుదల చేశారు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలోనూ ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైల‌ర్ అదిరిపోయింది.

RRR Trailer launched massive response to it

‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా తారక్ అదరగొట్టారని ట్రైలర్ చూసి చెప్పొచ్చు. జనవరి 7వ తేదీన జరగబోయే విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో.. లేటెస్టుగా విడుదలైన 3.07 నిమిషాల ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ వెల్లడిస్తోంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారని అర్థం అవుతోంది.

ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ – సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఆయువుపట్టుగా నిలిచాయి. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్ – హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా మెప్పించారు. అజయ్ దేవగన్ – సముద్ర ఖని – శ్రియా లు సినిమాలో కొంత సేపే కనిపించినా ఆకట్టుకున్నారు. రూ.450 కోట్ల బ‌డ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి