గురువారం, జూన్ 11, 2026
వినోదం

Renu Desai : గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న రేణూ దేశాయ్.. షాక్‌లో ఫ్యాన్స్..

Renu Desai : రేణూ దేశాయ్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండో భార్య‌గా అంద‌రికి గుర్తొస్తుంది. బద్రి’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణూ ఆయ‌న‌తో క‌లిసి జాని సినిమా కూడా చేసింది.…

Renu Desai : గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న రేణూ దేశాయ్.. షాక్‌లో ఫ్యాన్స్..

Renu Desai : రేణూ దేశాయ్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండో భార్య‌గా అంద‌రికి గుర్తొస్తుంది. బద్రి’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణూ ఆయ‌న‌తో క‌లిసి జాని సినిమా కూడా చేసింది. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం ఏర్ప‌డ‌డం అది ప్రేమ‌గా మారి 2009లో పవన్-రేణు పెళ్లి చేసుకున్నారు. ఇక అనుకోని కార‌ణాల వ‌ల‌న 2012లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీళ్లకు అకీరా, ఆద్య అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇక హీరోయిన్, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్.. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతుంది.

అయితే తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తరుచుగా సమాచారాన్ని అందిస్తుంటుంది. తాజాగా ఆమె ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యపై రేణూ దేశాయ్ పోస్ట్‌ పెట్టింది. త్వరలోనే కోలుకొని సాధారణ స్థితికి వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా గుండె సంబంధ సమస్య, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలిపింది. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే తనలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ధైర్యాన్నివ్వడం కోసం, వారిలో పాజిటివిటీని నింపేందుకే అని పేర్కొంది.

Renu Desai suffering from heart health issue
Renu Desai

మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకూడదని, శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా బలంగా ఉండాలని రేణూ పేర్కొంది. ఎప్పటికైనా ఫలితం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను మీపై, మీ జీవితంపై ఆశను వ‌దులుకోవ‌ద్దు అంటూ రేణూ దేశాయ్ త‌న పోస్ట్‌లో తెలియ‌జేసింది. మనకోసం ఈ విశ్వం ఎన్నో అద్భుతాలను దాచివుంచిందని, ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఎదుర్కోవాలంటూ పేర్కొంది. ప్రస్తుతం నేను ఈ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నానని, యోగా, ఔషధాలు, పోషకాహారాన్ని తీసుకుంటున్నట్లు, త్వరలోనే తాను సాధారణ స్థితికి వచ్చి తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నట్లు వెల్లడించింది . అయితే రేణూ త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై స‌డెన్‌గా ఇలాంటి కామెంట్ చేయ‌డంతో అంద‌రు షాక్‌లో ఉన్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పోస్ట్‌లు పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి