Akira Nandan : అకీరా నంద‌న్ ఫొటోను షేర్ చేసిన రేణు దేశాయ్‌.. అంద‌రికీ రిక్వెస్ట్‌..!

June 10, 2022 7:41 PM

Akira Nandan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఈమె త‌న త‌న‌యుడు అకీరా నంద‌న్ గ్రాడ్యుయేష‌న్ డే సంద‌ర్భంగా ఫొటోను షేర్ చేసి షాకిచ్చారు. అందులో ప‌వ‌న్ కూడా ఉండ‌డం విశేషం. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ హాజ‌ర‌వ్వాలి కాబ‌ట్టి వారిద్ద‌రూ ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇక చాలా రోజుల త‌రువాత ప‌వ‌న్‌ను, రేణు దేశాయ్‌ని ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల‌య్యారు. ఆ కార్య‌క్ర‌మంలో అకీరా నంద‌న్ పియానో కూడా వాయించాడు. ఆర్ఆర్ఆర్ మూవీలోని దోస్తీ పాట‌ను వాయించి అల‌రించాడు.

అయితే తండ్రి ప‌వ‌న్ లాగే అకీరా నంద‌న్ కూడా ఇప్ప‌టికే ప‌లు క‌ళ‌ల్లో ప్రావీణ్య‌త సంపాదించాడు. ముఖ్యంగా మార్ష‌ల్ ఆర్ట్స్‌ను నేర్చుకుంటున్నాడు. ఇక ఇటీవ‌లే త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ర‌క్త‌దానం చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. దీంతో తండ్రి బాట‌లోనే త‌న‌యుడు న‌డుస్తున్నాడ‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ కితాబిచ్చారు. ఇక తాజాగా రేణు దేశాయ్ మ‌ళ్లీ అకీరా నంద‌న్ ఫొటోను షేర్ చేశారు. అందులో అకీరా కొబ్బ‌రి బొండాంలోని నీళ్ల‌ను తాగుతూ కారులో కూర్చుని క‌నిపించాడు. ఈ సంద‌ర్భంగా రేణు దేశాయ్ ఆ ఫొటోకు కామెంట్ కూడా పెట్టారు.

Renu Desai shared Akira Nandan photo requested not to use straws
Akira Nandan

ప్ర‌స్తుతం చాలా మంది కొబ్బ‌రిబొండాంల‌లో నీళ్ల‌ను తాగేందుకు స్ట్రాల‌ను వాడుతున్నార‌ని.. అయితే కొబ్బ‌రి నీళ్లు మ‌న‌కు మంచివే అయిన‌ప్ప‌టికీ వాటిని తాగేందుకు ఉప‌యోగిస్తున్న స్ట్రా వ‌ల్ల మ‌న‌కు, మ‌న ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లుగుతుంద‌ని.. క‌నుక కొబ్బ‌రి బొండాంలోని నీళ్ల‌ను అకీరా నంద‌న్ తాగిన‌ట్లు తాగాల‌ని.. రేణు దేశాయ్ చెప్పారు. ఈ మేర‌కు ఆమె అంద‌రికీ రిక్వెస్ట్ చేశారు. ఇక కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ నుంచి వ‌స్తుండ‌గా.. దారిలో ఆమె ఆగి ఇలా అకీరాకు కొబ్బ‌రిబొండాం ఇప్పించారు. అనంత‌రం ఆ బొండాల‌ను అమ్ముకునే మ‌హిళ‌ను అడిగి ఆమె ఫొటో తీసుకున్నారు. కాగా రేణు దేశాయ్ పెట్టిన పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అకీరానంద‌న్‌ను కొత్త‌గా చూస్తున్న‌ట్లు ఉంద‌ని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now