గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Renu Desai : షూటింగ్ లో క‌ష్ట‌ప‌డుతున్న రేణు దేశాయ్‌.. పోస్ట్ వైర‌ల్‌..!

Renu Desai : బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్‌ నటిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బద్రి చిత్ర సమయంలో…

Renu Desai : షూటింగ్ లో క‌ష్ట‌ప‌డుతున్న రేణు దేశాయ్‌.. పోస్ట్ వైర‌ల్‌..!

Renu Desai : బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్‌ నటిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బద్రి చిత్ర సమయంలో పవన్‌తో ప్రేమలో పడి ఆయనతోనే పెళ్లిపీటలెక్కింది. ఇక 2012లో పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్నారు రేణూ దేశాయ్‌. అయినా ఇప్పటికీ జనాలు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఆమెను చూస్తుంటారు. అప్పుడప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్న ఆమె కొన్ని డ్యాన్స్ షోలు, రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.

కరోనా కంటే ముందు నుంచి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రైతు గురించి రేణూ దేశాయ్ ఎన్నో ప్రణాళికలు ఆలోచించింది. ఎర్రటి ఎండలో.. నేల రెండుగా చీలి ఉన్న సమయంలోనే షూటింగ్ చేయాలని రేణూ దేశాయ్ ఎప్పటి నుంచో అనుకుంటోంది. గత రెండేళ్లుగా ఆ టైంలో లాక్డౌన్, కరోనా అంటూ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన రైతు ప్రాజెక్ట్‌ను రేణూ దేశాయ్ పక్కన పెట్టేసింది.

Renu Desai latest post from Ravi Teja film shooting location
Renu Desai

అకీరా నందన్, ఆద్యలతో పాటు రేణూ దేశాయ్ ఓ నెల పాటుగా స్కాట్లాండ్ దేశంలో అంతా తిరిగి వచ్చినట్టుంది. అకీరా గ్రాడ్యుయేషన్ కోసం స్కాట్లాండ్  వెళ్లినట్టు కనిపిస్తోంది. అసలే అకీరా నందన్ తన గ్రాడ్యుయేషన్ కోసం ఏవేవో కలలు కంటున్నాడని రేణూ దేశాయ్ తెలియజేసింది. సంగీతంలో మాస్టర్స్ చేయాలని కోరిక ఉందంటూ, అంతేకాకుండా బాక్సింగ్, బాస్కెట్ బాల్ ఇలా ఆటల్లోనూ ఆరితేరిపోవాలని ఉందంటూ అకీరా నందన్ తన కోరికల లిస్ట్ చెబుతుంటాడట. ప్రస్తుతం రేణూ దేశాయ్ మాత్రం షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టేసింది. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత రవితేజ హీరోగా రాబోతోన్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది రేణూ దేశాయ్. ఈ చిత్రంతో రేణుదేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నాడు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో  చిరంజీవి, రేణూ దేశాయ్ మాత్రం మాట్లాడుకోలేదు. ఇక ఈ చిత్రంలో భాగస్వామి అయినందుకు, తనకు మంచి పాత్రను తనకు ఇచ్చినందుకు రేణు దేశాయ్ దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది. వేసవి ఎండలు దంచికొడుతున్నాయో ఏమో గానీ సెట్‌లో చాలా మంది గొడుగులు పట్టుకున్నారట. అందరూ షూటింగ్ లో ఎంతో కష్టపడుతూ గొడుగులు పట్టుకున్న‌ వీడియోను రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ వేసింది. త్వరలో టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రేణుదేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి