Rashmika : కన్నడ సోయగం రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. దసరా పండుగ సందర్భంగా రష్మిక హీరోయిన్ గా నటించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో రష్మిక క్యూట్ లుక్స్‌లో కనిపించింది.
అయితే కొందరు మాత్రం రష్మికపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకున్నారురా.. అంటూ రష్మిక ఫోటోను, నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. తనపై చేసిన ట్రోల్స్‌కి రష్మిక క్యూట్‌గా స్పందించింది. “నా యాక్టింగ్ కోసం ” అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీనికి ఆ నెటిజన్ మళ్ళీ తిరిగి స్పందించలేదు. రష్మిక స్పోర్టివ్, కాన్ఫిడెంట్ రిప్లై తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
రీసెంట్‌గా దక్షిణాది సినీ తారల సోషల్ మీడియా పాపులారిటీ ఆధారంగా ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితా రూపొందించింది. ఇందులో రష్మిక మందన్న 9.88 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, విజయ్ దేవరకొండ (9.67) రెండోస్థానంలో ఉన్నాడు. కన్నడ స్టార్ యశ్ (9.54) మూడో స్థానంలో, సమంత (9.49) నాలుగో స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ (9.46) కు ఐదో స్థానం, ప్రభాస్ (9.40) కు ఎనిమిదో స్థానం లభించాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…