గురువారం, జూన్ 11, 2026
వినోదం

ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లి..? ర‌ష్మిక మౌనానికి అర్థం ఏమిటి..? ఫ్యాన్స్‌లో మొదలైన చర్చ!

నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో జరిగిన చిన్నపాటి సంభాషణలోనే తన పెళ్లి తేదీపై జరుగుతున్న చర్చలకు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లి..? ర‌ష్మిక మౌనానికి అర్థం ఏమిటి..? ఫ్యాన్స్‌లో మొదలైన చర్చ!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్న పెళ్లి వార్తలు. Photo Credit: IWM Buzz.
Rashmika Mandanna wedding rumors with Vijay Deverakonda in February 2026.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్న పెళ్లి వార్తలు. Photo Credit: IWM Buzz.

నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో జరిగిన చిన్నపాటి సంభాషణలోనే తన పెళ్లి తేదీపై జరుగుతున్న చర్చలకు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో రష్మికను చూసిన ఫోటోగ్రాఫర్లు, ఫిబ్రవరి 26న పెళ్లికి శుభాకాంక్షలు.. అంటూ ఆమెను అభినందించారు. దీనిని ఆమె ఖండించకుండా, చిరునవ్వుతో తల ఊపడం గమనార్హం. ఈ స్పందనను అభిమానులు, మీడియా వర్గాలు ఆమె పెళ్లి తేదీకి మౌన సమ్మతిగా భావిస్తున్నాయి.

ఫిబ్ర‌వ‌రి 26నే..?

విశ్వసనీయ సమాచారం ప్రకారం, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న‌ట్లు తెలుస్తోంది. గత సంవత్సరం అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగినట్లు మీడియాలో వ‌చ్చింది. కానీ వారు ఈ విషయాన్ని ధ్రువీక‌రించ‌లేవు. అయితే అప్పటి నుంచి వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారు.

వ‌రుస షూటింగ్‌ల‌తో బిజీ..

పెళ్లి ఏర్పాట్ల మధ్య కూడా రష్మిక తన సినీ బాధ్యతలను విస్మరించలేదు. వరుస షూటింగ్‌లతో బిజీగా కొనసాగుతూ, ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌కు పూర్తి న్యాయం చేస్తోంది. రష్మిక – విజయ్ జంట గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ మరోసారి కలిసి రణబాలి అనే పీరియాడిక్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కాగా ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అయితే వీరి పెళ్లి వేడుకలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి