గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Ram Charan Tej : సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్న మెగా ప‌వ‌ర్ స్టార్..!

Ram Charan Tej : ఎంతో మంది అక్రమార్కుల ఆట కట్టించి, ఆ చేతులతోనే ఎంతో మందికి ఆదర్శ పాఠాలు దిద్ది వారి జీవితాలలో సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. మహారాష్ట్రలో…

Ram Charan Tej : సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్న మెగా ప‌వ‌ర్ స్టార్..!

Ram Charan Tej : ఎంతో మంది అక్రమార్కుల ఆట కట్టించి, ఆ చేతులతోనే ఎంతో మందికి ఆదర్శ పాఠాలు దిద్ది వారి జీవితాలలో సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. మహారాష్ట్రలో అడిషనల్ డీజీపీ హోదాలో పని చేసిన ఆయ‌న 2018లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ఆయన.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనసేన పార్టీలో చేరిన లక్ష్మీ నారాయణ.. విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు.

Ram Charan Tej to appear as cbi ex jd lakshmi narayana in movie

ఓట‌మి త‌ర్వాత జనసేన నుంచి బయటకొచ్చిన ఆయన.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇప్పుడు ఆయ‌న జీవితానికి సంబంధించి రామ్ చ‌ర‌ణ్ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన చెర్రీ త‌న 15వ సినిమాగా, దిల్ రాజు బ్యానర్‌లో 50వ చిత్రంగా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు.

పాన్ ఇండియన్ లెవెల్‌లో రాబోతోన్న ఈ చిత్రానికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో చరణ్ పాత్ర పోలీసు అధికారి నుండి రాజకీయ నాయకుడిగా మారిన జేడీ లక్ష్మీ నారాయణ జీవితాన్ని పోలి ఉంటుందని అంటున్నారు. సత్యం కుంభకోణం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసు వంటి అనేక పాపులర్ కేసులను డీల్ చేసిన జేడీ పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడ‌నే విష‌యం నిజ‌మైతే సినిమాపై అంచ‌నాలు భారీగా ఉండ‌డం స‌హ‌జం. మరి కథ అదే అయితే సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి