గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Ram Charan Tej : అయ్యో రామ్ చరణ్.. కోట్లకు అధిపతి అయినా తన కోరికను మాత్రం తీర్చుకోలేకపోయాడు..?

Ram Charan Tej : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.…

Ram Charan Tej : అయ్యో రామ్ చరణ్.. కోట్లకు అధిపతి అయినా తన కోరికను మాత్రం తీర్చుకోలేకపోయాడు..?

Ram Charan Tej did not get his wish news trended that time

Ram Charan Tej : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమాలో రామ్ చరణ్, నేహా శర్మ జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో చరణ్ కు ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో బిజీగా మారారు.

అయితే రామ్ చరణ్ చిరుత సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ నేహా శర్మతో పరిచయం బాగా ఏర్పడి అది ప్రేమగా మారిందట. ఈ క్రమంలోనే తన ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయట. అయితే ఈ విషయంపై చిరు కూడా సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. అలా రామ్ చరణ్ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో అందుకు వారు ఒప్పుకోకపోవడంతో రామ్ చరణ్ కెరియర్ పై దృష్టి సారించారని తెలుస్తోంది.

ఇలా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ ఉపాసనను వివాహం చేసుకున్నారు. ఇలా తన కెరీర్‌లో కొన్ని కోట్లు సంపాదిస్తున్నప్పటికీ తాను ప్రేమించిన వ్యక్తిని మాత్రం రామ్ చరణ్ పెళ్లి చేసుకోలేకపోయాడని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

ఉపాసనతో వివాహం తర్వాత చెర్రీ తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అందుకే అంటారు.. విధి ఎలా ఉంటే అలా జరుగుతుందని. ఉపాసనను వివాహం చేసుకోవడం వల్లే ఆయన దశ తిరిగిందని అంటుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి