గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Rakul preet singh : రకుల్ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!?

rakul preet singh : టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్ల లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ధ్రువ, సరైనోడు, జయ…

Rakul preet singh : రకుల్ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!?
rakul preet singh

rakul preet singh : టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్ల లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ధ్రువ, సరైనోడు, జయ జానకి నాయక వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది ఈ అమ్మడు. అయితే ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెలుగులో ఎటువంటి సినిమాలు రాలేదు. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో ముచ్చటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగు ప్రేక్షకుల నుండి ఇదే ప్రశ్న తరచుగా ఎదురయింది.

తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు? అంటూ ఆమె అభిమానులు ఆమెను అడగడం జరిగింది. దీనితో ఇక ఆ ప్రశ్నకు రకుల్ తప్పక సమాధానం చెప్పవలసి వచ్చింది. ఆమె స్పందిస్తూ నా సినీ జీవితంలో నేను ఇంత ఎత్తుకు ఎదగడానికి తెలుగు సినిమానే కారణం. నాకు కూడా తెలుగులో సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తెలుగు సినిమా చేయలేకపోతున్నాను. అతి త్వరలోనే ఒక మంచి సినిమాతో తెలుగులో మళ్లీ కనిపిస్తాను అంటూ తన అభిమానులకు జవాబు ఇచ్చింది ఈ అమ్మడు.

rakul preet singh
rakul preet singh

తన పుట్టినరోజు వేడుకలను లండన్ లో తన ప్రియుడు జక్కి భగ్నాని, స్నేహితులు మలైకా ఆరోరా, అర్జున్ కపూర్, డినో మోరియా, భూమి ఫడ్నేకర్ లతో ఘనంగా జరుపుకుంది. డాక్టర్ జీ సినిమాలో ఆయిష్మాన్ ఖురానా తో నటిస్తుంది. 10కి పైగా హిందీ సినిమాలను వరుసలో పెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం సినిమాలు చేయడానికి తీరికలేదని తన అభిమానులకి మస్కా కొడుతుంది అని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి