Rakul Preet Singh : తెలుగు ఆడియన్స్ కు పరిచయం అక్కర్లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు తెలుగులో రచ్చ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ను ఏలిన ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజియెస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. గత కొంతకాలంగా వరుస హిందీ సినిమా ఆఫర్లు అందుకుంటూ.. బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది ఈ భామ. అయితే జాన్ అబ్రహాంతో రకుల్ నటించిన ఎటాక్.. ఏప్రిల్ 1న విడుదల అయింది.
జాన్ అబ్రహాం ఇతర సినిమాలలాగే ఎటాక్ కూడా ఒక యాక్షన్ డ్రామా మూవీ. అయితే ఈ సినిమాలో రకుల్ ఒక సైంటిస్ట్‌గా కనిపించగా, ఆ పాత్ర కోసం తాను చాలా కసరత్తు చేసినట్టు రకుల్ తెలిపింది. ల్యాబ్‌లో తనకు అలవాటు అవ్వడానికే రెండు, మూడు రోజులు పట్టిందట. తాను ఒక సైంటిస్ట్‌గా అక్కడ ఉన్న పరికరాలు అన్నీ అలవాటు ఉన్నట్టు నటించడానికి చాలా కష్టపడ్డానంటూ తెలిపింది రకుల్. ఇక రకుల్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. వెరైటీ డ్రెస్సులలో నానా రచ్చ చేస్తూ భీబత్సం సృష్టిస్తోంది. తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్‌ను తెలుగులో మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరని ప్రశ్నించాడు ఓ నెటిజన్.
దానికి అల్లు అర్జున్ అని సమాధానమిచ్చింది రకుల్. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్‌తో రకుల్ జతకట్టగా.. ఆ సినిమా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. గతేడాది వైష్ణవ్‌తేజ్-క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన కొండపొలం సినిమాలో మెరిసింది రకుల్. ప్రస్తుతం 31అక్టోబర్ లేడీస్ ఫైట్ అనే తెలుగు సినిమా చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుందీ సినిమా. అలాగే ఈ అమ్మడి ఖాతాలో అరడజనుకి పైగా హిందీ సినిమాలు ఉన్నాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…