Radhe Shyam : రాధేశ్యామ్ రికార్డుల మోత‌.. యూట్యూబ్‌లో ఈ మూవీ సాంగ్ ట్రెండింగ్‌..

Radhe Shyam : రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్ప‌టికే మాస్ హీరోగా ఎంతో గుర్తింపు పొందాడు. ఆయ‌న చేసిన సినిమాల్లో చాలా వ‌ర‌కు మాస్ సినిమాలే ఉన్నాయి. రొమాంటిక్ జోన‌ర్‌లో చేసిన సినిమాలు త‌క్కువ‌. ఇక తాజాగా ఆయ‌న పూజా హెగ్డెతో క‌లిసి రాధే శ్యామ్ అనే రొమాంటిక్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ మూవీపై అంద‌రిలోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

రాధేశ్యామ్ లో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య అనే పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు. ఇది ఓ గొప్ప ప్రేమ క‌థ అని తెలుస్తోంది. ఇక ఈ మ‌ధ్యే విడుద‌లైన ఈ మూవీకి చెందిన టీజ‌ర్ యూట్యూబ్‌లో 60 గంట‌ల‌కు పైగా ట్రెండింగ్‌లో ఉండి రికార్డు సృష్టించింది. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మ‌రే సినిమాకు సాధ్యం కాని రికార్డుల‌ను రాధే శ్యామ్ తిరగ రాసింది.

కాగా రాధేశ్యామ్ మూవీలో ప్ర‌భాస్ భ‌విష్య‌త్‌ను చెప్పే విక్ర‌మాదిత్య‌గా న‌టిస్తున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా మొద‌టి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ అయింది. ఎవ‌రో.. వీరెవ‌రో అంటూ సాగే ఈ పాట‌కు ఆడియెన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది.

కాగా యూట్యూబ్ లో ఈ పాట సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ పాట 10 మిలియన్ వ్యూస్ ల‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్ర‌మంలోనే రాధేశ్యామ్ మూవీ స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM