గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pooja Hegde : ఇకపై అలాంటి హీరోలతో నటించే పరిస్థితిలో లేని పూజా హెగ్డే ?

Pooja Hegde : ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి పూజా హెగ్డే. నటించిన మొదటి సినిమానే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే నటించిన ముకుంద, దువ్వాడ జగన్నాథం…

Pooja Hegde : ఇకపై అలాంటి హీరోలతో నటించే పరిస్థితిలో లేని పూజా హెగ్డే ?

Pooja Hegde : ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి పూజా హెగ్డే. నటించిన మొదటి సినిమానే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే నటించిన ముకుంద, దువ్వాడ జగన్నాథం వంటి చిత్రాలు కూడా అంతంత మాత్రమే అనిపించుకున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా తెరకెక్కింది. ఇందులో ఐటమ్ సాంగ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.

Pooja Hegde may not be available to act with that type of heroes

ఇలా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగ చైతన్య, అఖిల్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరు హీరోల సరసన నటించి ప్రస్తుతం హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే బాలీవుడ్, కోలీవుడ్ లలోనూ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇండస్ట్రీలో ఇలా దూసుకుపోతున్న బుట్టబొమ్మ కొద్దిరోజులలో మిడ్ రేంజ్ హీరోలతో నటించే పరిస్థితులు కనపడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈమె నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి