NTR : ప్యారిస్‌లో త‌నయుడు అభ‌య్ రామ్‌తో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఎన్టీఆర్‌..!

November 21, 2021 5:07 PM

NTR : ఎన్టీఆర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తాజాగా వెకేష‌న్‌కు వెళ్లిన విష‌యం విదిత‌మే. ఆయ‌న ప్ర‌స్తుతం ఫ్యామిలీతో క‌లిసి ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే త‌న కుమారుడు అభ‌య్ రామ్‌తో క‌లిసి ఐఫిల్ ట‌వ‌ర్ వ‌ద్ద దిగిన ఫొటోను ఎన్‌టీఆర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

 NTR shared a photo of his son abhay ram at Paris Eifel tower

ఐఫిల్ ట‌వ‌ర్ వ‌ద్ద త‌న ఫ్యామిలీతో ఫొటోలు దిగిన ఎన్టీఆర్‌.. యాన్ ఐఫుల్ ఆఫ్ ది ఐఫిల్‌.. అనే క్యాప్ష‌న్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు పెట్టారు.

కాగా ఎన్‌టీఆర్ చేసిన ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ లైక్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ త్వ‌ర‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో సంద‌డి చేయ‌నున్నాడు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తేజ్ కూడా కీల‌క పాత్ర పోషించారు.

ఇక ఎన్‌టీఆర్ తాజాగా వెకేష‌న్‌కు వెళ్లే ముందు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఏపీ అసెంబ్లీలో త‌న‌ను, త‌న భార్య‌ను అవ‌మాన ప‌రిచారంటూ చంద్ర‌బాబు దుఃఖించ‌గా.. దాన్ని ఖండిస్తూ.. ఇలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డ‌కూడ‌ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ.. పోస్టు పెట్టారు. ఆ త‌రువాత వెకేష‌న్‌కు వెళ్లారు. త్వ‌ర‌లో ఎన్‌టీఆర్.. కొర‌టాల శివ సినిమాలో చేయ‌నున్నారు. అందుక‌నే ఈ మ‌ధ్యలో దొరికిన గ్యాప్‌లో వెకేష‌న్‌కు వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment