గురువారం, జూన్ 11, 2026
వార్తలు

NTR Samantha : స‌మంత‌, ఎన్టీఆర్ క‌లిస్తే ఇలాంటి సెన్సేష‌న్స్ క్రియేట్ అవుతాయా..!

NTR Samantha : కొన్ని పెయిర్స్ ఎప్పుడు, ఎక్క‌డ క‌నిపించినా కూడా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతుంటాయి. అలాంటి పెయిర్స్‌లో ఎన్టీఆర్ – స‌మంత పెయిర్ ఒక‌టి. వెండితెరపై వీరిద్దరూ క‌లిసి బృందావ‌నం, రామ‌య్య వ‌స్తావ‌య్యా, జ‌న‌తా గ్యారేజ్…

NTR Samantha : స‌మంత‌, ఎన్టీఆర్ క‌లిస్తే ఇలాంటి సెన్సేష‌న్స్ క్రియేట్ అవుతాయా..!

NTR Samantha : కొన్ని పెయిర్స్ ఎప్పుడు, ఎక్క‌డ క‌నిపించినా కూడా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతుంటాయి. అలాంటి పెయిర్స్‌లో ఎన్టీఆర్ – స‌మంత పెయిర్ ఒక‌టి. వెండితెరపై వీరిద్దరూ క‌లిసి బృందావ‌నం, రామ‌య్య వ‌స్తావ‌య్యా, జ‌న‌తా గ్యారేజ్ వంటి చిత్రాల‌లో న‌టించి మెప్పించారు. ఇప్పుడు బుల్లితెర‌పై ఎన్టీఆర్‌తో క‌లిసి సంద‌డి చేసేందుకు సిద్ధ‌మయ్యారు. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి సమంత చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైంది. దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు.

NTR Samantha evaru meelo koteeshwarulu trending in youtube

తాజాగా ప్రోమో విడుద‌ల చేయ‌గా ఇందులో ఎన్టీఆర్‌ – సమంతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘కూర్చొంటే భయంగా ఉంది’ అని సమంత అనగా, ‘ఉంటుంది. ఇది హోస్ట్‌ సీట్‌.. అది హాట్‌ సీట్‌’ అంటూ ఎన్టీఆర్‌ సమాధానమిచ్చారు. ‘సాధారణంగా ఎవరైనా వెయ్యి నుంచి కోటికి వెళ్తారు.. నువ్వు కోటి నుంచి వెయ్యికి వస్తే ఆట బాగుంటుంది కదా’ అని ఎన్టీఆర్‌ అనడంతో సమంత నవ్వేసింది. ఆ తర్వాత ‘వదిలేయనా డబ్బు’ అని సమంత అనగా, ‘అయితే, క్విట్‌ అయిపోతావా’ అని ఎన్టీఆర్‌ అడిగారు. ‘మీరు ఇప్పుడు చెబుతున్నారు. ముందే చెప్పాలి కదా’ అని సమంత చెప్పుకొచ్చింది.

మంచి ఎంటర్‌టైనింగ్‌ గా కట్ చేసిన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో 2.2 మిలియన్ కి పైగా వ్యూస్ తో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇక ప్రోమోనే ఇంత‌లా సంద‌డి చేస్తుంటే, ప్రోగ్రాం ఎంత ర‌చ్చ చేస్తుందో చూడాలి. విడాకుల తరువాత సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్యపు వార్తలను పట్టించుకోకుండా తన మనోధైర్యంతో మొదటిసారిగా ఈ గేమ్ షోలో అతిథిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తాను స్ట్రాంగ్ అని సమంత నిరూపించుకుంది. అందుకే ఈ షోపై అంద‌రిలోనూ అంత ఆస‌క్తి నెల‌కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి