NTR Hanuman Deeksha : హ‌నుమాన్ దీక్ష చేప‌ట్టిన ఎన్‌టీఆర్‌.. ఈ దీక్ష చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

April 17, 2022 12:33 PM

NTR Hanuman Deeksha : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ హిట్ అయిన కార‌ణంగా ఇటీవలే చిత్ర యూనిట్ ముంబైలో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి న‌టీన‌టులు, సిబ్బంది అంద‌రూ హాజ‌ర‌య్యారు. అయితే పార్టీ అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ అయ్య‌ప్ప దీక్ష చేప‌ట్టగా.. తాజాగా ఎన్‌టీఆర్ హ‌నుమాన్ దీక్ష చేప‌ట్టారు. నారింజ రంగులోని దుస్తుల‌ను ధ‌రించిన ఎన్‌టీఆర్ అభిమానుల‌తో ఫొటోలు కూడా దిగారు. దీంతో ఆయ‌న ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి. అయితే హ‌నుమాన్ దీక్ష‌ను చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి.. అస‌లు దీక్ష‌ను ఎలా చేస్తారు.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

NTR Hanuman Deeksha know its benefits and how to do it
NTR Hanuman Deeksha

హ‌నుమాన్ దీక్ష‌ను కూడా అయ్య‌ప్ప దీక్ష‌లాగే చేస్తారు. హ‌నుమాన్ జ‌యంతి స‌మ‌యంలో ఈ మాల‌ను ధ‌రిస్తారు. తాజాగా హ‌నుమాన్ జ‌యంతి జ‌రిగింది క‌నుక అదే రోజు ఎన్‌టీఆర్ ఈ దీక్ష‌ను చేప‌ట్టారు. ఇక ఈ దీక్ష‌ను ఎన్‌టీఆర్ 21 రోజుల పాటు.. అంటే అర్ధ మండ‌లం పాటు చేస్తార‌న్న‌మాట‌. 42 రోజుల పాటు చేస్తే మండ‌ల దీక్ష అంటారు. ఇక మాల ధరించిన వారు రోజూ హ‌నుమాన్ పూజ‌లో ఉండాలి. ఆయ‌న ఆల‌యంలోనే నిద్రించాలి.

రోజూ హ‌నుమంతున్ని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజించాలి. హార‌తి ఇవ్వాలి. స‌న్నిధానంలో నిద్రించాలి. రోజూ హ‌నుమంతున్ని ద‌ర్శించుకోవాలి. ఆయ‌న నామాన్ని స్మ‌రించాలి. అలాగే హ‌నుమంతుడు రాముడికి ప్రియ‌మైన భ‌క్తుడు. క‌నుక హ‌నుమాన్ నామ స్మ‌ర‌ణ చేయ‌క‌పోయినా.. రామ నామాన్ని జ‌పిస్తే చాలు.. ఆంజ‌నేయ స్వామి సంతృప్తి చెందుతాడు. సంతోషిస్తాడు. భ‌క్తులు కోరిన కోర్కెలు నెర‌వేరుస్తాడు. క‌నుక‌నే హ‌నుమాన్ దీక్ష చేప‌డ‌తారు. ఏవైనా దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు పెండింగ్‌లో ఉన్నా లేదా అనుకున్న కోరిక‌లు అసలు నెర‌వేర‌క పోయినా.. ముందుగా హనుమంతుడికి మొక్కుతారు. స‌మ‌స్య ప‌రిష్కారం అయితే మాల ధ‌రిస్తామ‌ని వేడుకుంటారు. అలా జ‌రిగాక‌.. మాల ధార‌ణ చేస్తారు. ఇక కొంద‌రు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని.. కోరిన కోరిక‌లు నెర‌వేరాల‌ని ముందుగానే స్వామిని వేడుకుంటూ మాల‌ను ధ‌రిస్తారు. ఇలా హ‌నుమాన్ దీక్ష చేప‌డ‌తారు.

అయితే సినిమా సెల‌బ్రిటీలు చాలా మంది అయ్య‌ప్ప మాల‌నే ధ‌రిస్తుంటారు. కానీ ఎన్‌టీఆర్ మాత్రం ఆశ్చ‌ర్య‌క‌రంగా హ‌నుమాన్ దీక్ష చేప‌ట్ట‌డం విశేషం. ఏవైనా బ‌ల‌మైన కోరిక‌లు.. మొండి స‌మ‌స్య‌లు ఉంటే అవి ప‌రిష్కారం కావాల‌ని.. ఆయురారోగ్యాలు.. ఐశ్వ‌ర్యం క‌ల‌గాల‌ని.. దుష్ట శ‌క్తుల పీడ వ‌ద‌లిపోవాల‌ని కూడా హ‌నుమాన్ దీక్ష చేప‌డ‌తారు. దీంతోపాటు దిష్టి కూడా తొల‌గిపోతుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్‌టీఆర్ త్వ‌ర‌లో కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ముందుగా ఆలియా భ‌ట్ ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమెకు వివాహం జ‌ర‌గ‌డ‌మో.. మ‌రేమైనా కార‌ణాలు ఉన్నాయో.. తెలియ‌దు కానీ ఈ మూవీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఇంకో హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. అన్ని వివ‌రాలు క‌న్‌ఫామ్ కాగానే చిత్ర షూటింగ్‌ను ప్రారంభిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment