గురువారం, జూన్ 11, 2026
వార్తలు

NTR : వెకేష‌న్‌కి బ‌య‌లు దేరిన ఎన్టీఆర్.. ఈ టైంలో అవ‌స‌రమా.. అంటున్న ఫ్యాన్స్..!

NTR : ఎన్టీఆర్ గ‌త కొన్నాళ్లుగా విశ్రాంతి లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లో కొర‌టాల సినిమాతో బిజీ కానున్న నేప‌థ్యంలో ఆయ‌న ఫ్యామిలీతో వెకేష‌న్ ప్లాన్ చేశాడు. తన కుటుంబంతో స్విట్జర్లాండ్ కు బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున…

NTR : వెకేష‌న్‌కి బ‌య‌లు దేరిన ఎన్టీఆర్.. ఈ టైంలో అవ‌స‌రమా.. అంటున్న ఫ్యాన్స్..!

NTR : ఎన్టీఆర్ గ‌త కొన్నాళ్లుగా విశ్రాంతి లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లో కొర‌టాల సినిమాతో బిజీ కానున్న నేప‌థ్యంలో ఆయ‌న ఫ్యామిలీతో వెకేష‌న్ ప్లాన్ చేశాడు. తన కుటుంబంతో స్విట్జర్లాండ్ కు బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో భార్య పిల్లలతో కలిసి కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వెకేషన్ ఎన్ని రోజులు అనేది తెలియాల్సి ఉంది.

NTR gone to vacation with family fans angry

ఇక మరో పక్క ఎన్టీఆర్ వెకేషన్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నందమూరి ఫ్యామిలీకి అసెంబ్లీలో అవమానం జరిగిందని నందమూరి ఫ్యామిలీ అంతా ఒక పక్క కోపంతో రగిలిపోతున్నారు. ఈ టైంలో ఎన్టీఆర్ కుటుంబంతో ఎంజాయ్ చేయడం ఏంటీ..? అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఒక వీడియో ద్వారా స్పందించినా కూడా అది ఏదో నామమాత్రంగా చెప్పినట్లు ఉందే తప్ప.. ఇంకా ఫైర్ లేదని అభిమానులు మండిపడుతున్నారు.

ఎన్టీఆర్.. వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో ప్రాజెక్ట్స్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఈ చిత్రాన్ని దాదాపుగా రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2022 జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి