గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Niharika Chaithanya : నెట్టింట్లో ట్రెండింగ్ గా మారిన నిహారిక, చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ వీడియో..!

Niharika Chaithanya : మెగా డాటర్ నిహారికా, చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ 2020 డిసెంబర్ 9న జరిగింది. ఉదయ్ పూర్ లో అత్యంత ఘనంగా బందుమిత్రుల మధ్య సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ జంట గతేడాది ఆగస్ట్ లో నిశ్చితార్థం…

Niharika Chaithanya : నెట్టింట్లో ట్రెండింగ్ గా మారిన నిహారిక, చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ వీడియో..!

Niharika Chaithanya : మెగా డాటర్ నిహారికా, చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ 2020 డిసెంబర్ 9న జరిగింది. ఉదయ్ పూర్ లో అత్యంత ఘనంగా బందుమిత్రుల మధ్య సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ జంట గతేడాది ఆగస్ట్ లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ ను ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేశారు. ఈ పెళ్ళికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఎంజాయ్ చేశారు. ఉదయ్ పూర్ రాయల్ వెడ్డింగ్ ట్రెండ్ బాలీవుడ్ సినీ నటులతో మొదలైంది.

Niharika Chaithanya  destination wedding video viral in youtube

ఇక రీసెంట్ గా విడుదల చేసిన నిహారిక, చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ఫిల్మ్ యూట్యూబ్ లో అత్యంత ఎక్కువ వ్యూస్ ని సంపాదించుకుని రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇందులో సంగీత్ తో పాటు మెగా ఫ్యామిలీతో నిహారికా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి లైఫ్ టైమ్ మెమరీని సొంతం చేసుకుంది. మంగళ స్నానాలతోపాటు సంగీత్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. ఒకే వేదిక మీద మెగా హీరోలను చూస్తుంటే ఆ ఆనందమే వేరు. పెళ్ళి ఘట్టం మొదలయ్యాక.. చైతన్య, నిహారికాకు ఇచ్చిన లెటర్ హైలెట్ గా నిలిచింది.

 కన్నుల పండుగగా వీరి పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. పెళ్ళి కూతురిగా మారిన నిహారికాను మెగా ఫ్యామిలీ మరింత అందంగా తీర్చిదిద్దింది. పెళ్ళి ఘట్టంలో ఎంతో చక్కగా డిజైన్ చేశారు. ఇక మెగాస్టార్, నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు నిహారికాను ఆశీర్వదించారు. తాళి కట్టే సమయంలో నిహారికా క్యూట్ ఎమోషనల్ మూమెంట్ మరింత అందంగా ఉంది. ఫైనల్ గా సరదా సరదాగా సాగిన నిహారికా, చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ వీడియో ఫుల్ గా ట్రెండ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి