గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Janhvi Kapoor : జాన్వీక‌పూర్‌పై దారుణ‌మైన కామెంట్లు.. మ‌రీ అలాంటి డ్రెస్ వేసుకున్నావేంటి.. అని ప్ర‌శ్న‌..!

Janhvi Kapoor : శ్రీ‌దేవి ముద్దుల కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ జాన్వీ క‌పూర్ మాత్రం న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె న‌టించిన చిత్రాలు ఇప్ప‌టి వ‌ర‌కు యావ‌రేజ్ టాక్‌ను సొంతం…

Janhvi Kapoor : జాన్వీక‌పూర్‌పై దారుణ‌మైన కామెంట్లు.. మ‌రీ అలాంటి డ్రెస్ వేసుకున్నావేంటి.. అని ప్ర‌శ్న‌..!

Janhvi Kapoor : శ్రీ‌దేవి ముద్దుల కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ జాన్వీ క‌పూర్ మాత్రం న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె న‌టించిన చిత్రాలు ఇప్ప‌టి వ‌ర‌కు యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. కానీ న‌టిగా ఈమెకు మంచి మార్కులే ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ఈమె ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఇక టాలీవుడ్‌కు కూడా ఈమెను ప‌రిచ‌యం చేయాల‌ని ఇక్క‌డి ద‌ర్శ‌క నిర్మాతలు చూస్తున్నారు. కానీ త‌న త‌ల్లి శ్రీ‌దేవి కోరిక మేర‌కు తెలుగు తెర‌కు ఎన్టీఆర్ సినిమాతోనే ప‌రిచ‌యం కావాల‌ని జాన్వీ చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే ఆమె టాలీవుడ్ తెరంగేట్రం ఆల‌స్యం అవుతుంద‌ని స‌మాచారం.

ఇక జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. అందాల ఆర‌బోత‌లో ఇత‌ర హీరోయిన్ల‌తో పోటీ ప‌డుతుంటుంది. సై అంటే సై అంటుంది. భారీ అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో సీనియ‌ర్ హీరోయిన్ల‌తో ఈమె పోటీ ప‌డుతోంది. దీంతో జాన్వీ క‌పూర్‌కు ఫాలోవ‌ర్లు కూడా బాగానే పెరుగుతున్నారు. ఇక ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు అందాల ఆర‌బోత ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తుంటుంది. అయితే తాజాగా జాన్వీ ఓ పార్టీ నిమిత్తం ఓ హోట‌ల్‌కు వెళ్లింది. ఈ క్ర‌మంలోనే ఆమె ధ‌రించిన డ్రెస్‌పై నెటిజ‌న్లు దారుణ‌మైన విమ‌ర్శ‌లు, కామెంట్లు చేస్తున్నారు.

netizen comments on Janhvi Kapoor for her latest black dress
Janhvi Kapoor

జాన్వీ క‌పూర్ న‌లుపు రంగు డ్రెస్ ధ‌రించ‌గా.. ఎద భాగం మొత్తం క‌నిపిస్తోంది. అలాగే డ్రెస్ మ‌రీ ప‌లుచ‌గా ఉంది. దీంతో ఆమెపై నెటిజన్లు ట్రోలింగ్ మొద‌లు పెట్టారు. ఇలాంటి డ్రెస్ ధ‌రించ‌క‌పోతే కాస్త మంచి దుస్తులు వేసుకోవ‌చ్చు కదా.. అంటూ ఆమెను విమ‌ర్శిస్తున్నారు. అయితే ఆ విమ‌ర్శ‌ల‌కు జాన్వీ స్పందించింది. తాను ఇలాంటి ట్రోల్స్‌ను, విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోన‌ని ఖ‌రాఖండిగా చెప్పేసింది. ఇక ఈమె గుడ్ ల‌క్ జెర్రీ, మిలి, మిస్టర్ అండ్ మిసెస్ మ‌హి, బ‌వాల్ అనే చిత్రాల్లో న‌టిస్తోంది. ఇవి త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి