Nassar : చిరంజీవి, నేను బ్యాచ్‌మేట్స్‌.. అలా చేస్తే చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు.. నాజర్‌ కామెంట్స్‌ వైరల్‌..!

Nassar : సీనియర్‌ నటుడు నాజర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో నటించి నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. బాహుబలి సినిమాలో భల్లాల దేవ తండ్రి పాత్రలో మెప్పించారు. అలాగే అనేక సినిమాల్లో తాత, తండ్రి, సైంటిస్టు, టీచర్‌ వంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. అయితే నాజర్‌ ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన మాటల్లోనే చదువుదాం.

నేను, చిరంజీవి బ్యాచ్‌మేట్స్‌. ఇద్దరం ఒకే యాక్టింగ్‌ స్కూల్‌లో యాక్టింగ్‌ నేర్చుకున్నాం. చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉండేవాన్ని. యాక్టింగ్‌ స్కూల్‌ చెన్కైలో ఉండేది. టైముకు చేరడం కోసం ఉదయం 6 గంటలకే బయలుదేరే వాన్ని. అప్పటికి అమ్మ కేవలం అన్నం మాత్రమే వండేది. దాన్ని బాక్స్ లా కట్టుకుని యాక్టింగ్‌ స్కూల్‌కు చేరుకునేవాన్ని. చిరంజీవి, ఇతరులు కొందరు అక్కడే బయట మెస్‌ నుంచి అన్నం తెప్పించుకునేవారు. అయితే ఒకసారి నా దగ్గర కేవలం అన్నం మాత్రమే ఉండడాన్ని చిరంజీవి చూశారు. రేపటి నుంచి అన్నం కోసం అమ్మగారిని ఉదయం లేపకు. అలా చేస్తే చంపేస్తా. నిద్రలేచి నేరుగా వచ్చేయి. నువ్వు కూడా మాతోపాటు తిను.. అని చిరంజీవి అన్నారు. ఆయన అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.. అలా చిరంజీవి నాకు మంచి ఫ్రెండ్‌ అయ్యారు.. అని నాజర్‌ అన్నారు.

Nassar

ఇక యాక్టింగ్‌ స్కూల్‌లో నటనలో శిక్షణ తీసుకున్న అనంతరం తనకు వెంటనే సినిమా చాన్స్‌లు రాలేదని నాజర్‌ అన్నారు. చిరంజీవికి మాత్రం వెంటనే అవకాశాలు వచ్చాయన్నారు. కానీ అప్పట్లో తన ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాలు తనకు సెట్‌ కావని నిర్ణయించుకుని తాజ్‌ కోరమాండల్‌ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశానని.. ఓ సారి పక్కనే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్లి చూశానని.. అయితే తాను వెనక్కి తిరిగి వెళ్లిపోతుండగా.. చిరంజీవి పిలిచారని.. ఏం చేస్తున్నావని అడిగితే.. హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నానని.. నాజర్‌ చెప్పారు. దీనికి చిరంజీవి స్పందిస్తూ.. ఇంత మంచి యాక్టర్‌వి హోటల్‌లో పనిచేయడం ఏంటి.. రేపు వచ్చి కలువు.. మాట్లాడుదాం.. అని చిరంజీవి అన్నారని నాజర్‌ తెలిపారు. అయినప్పటికీ తాను సినిమాల్లోకి వెళ్లొద్దని నిర్ణయించుకున్నానని.. కనుక చిరంజీవి పిలిచినా కలవలేదని అన్నారు. ఆ తరువాత బాలచందర్‌ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.. అప్పటి నుంచి ఇక వెను దిరిగి చూడలేదని నాజర్‌ అన్నారు. కాగా చిరంజీవిపై నాజర్‌ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM

ఎస్‌బీఐలో 2050 భారీ ఉద్యోగాలు: నేటి నుంచే దరఖాస్తులు.. అర్హతలివే!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…

Thursday, 29 January 2026, 2:43 PM