గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Nara Rohith : వైసీపీ నేతల 100 తప్పులు పూర్తయ్యాయి.. భరతం పడతాం..

Nara Rohith : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు తనపై తన సతీమణి భువనేశ్వరిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు విలపించిన విషయం విదితమే. అయితే ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ…

Nara Rohith : వైసీపీ నేతల 100 తప్పులు పూర్తయ్యాయి.. భరతం పడతాం..

Nara Rohith : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు తనపై తన సతీమణి భువనేశ్వరిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు విలపించిన విషయం విదితమే. అయితే ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర దూమారం రేపుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ నుంచి వాకౌట్ అయిన చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో భోరున విలపించారు. ఇక ఈ ఘటనపై పలువురు సినీ హీరోలు స్పందిస్తున్నారు.

Nara Rohith says 100 mistakes of ysrcp leaders completed

ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్ ఈఘటనపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నటుడు నారా రోహిత్ స్పందించారు. అధికారంలో ఉన్న కొందరు నేతలు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన సభలో అధికార పక్షం.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.

రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కును దుర్వినియోగం చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని రోహిత్‌ అన్నారు. శిశుపాలుడి మాదిరిగానే వైసీపీ నాయకుల 100 తప్పులు పూర్తయ్యాయని, ఇక తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ దుశ్శాసనుల భరతం పట్టే సమయం ఆసన్నమైందని, స్థాయి లేని వ్యక్తుల మధ్య రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న.. అంటూ నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి