---Advertisement---

Nagarjuna : నాగార్జున వ‌ల్లే నాగ‌చైత‌న్య జీవితం నాశ‌నం అయిందా ?

July 28, 2022 8:54 AM
---Advertisement---

Nagarjuna : టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరుగాంచిన నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డం ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. వారు అస‌లు విడాకులు ఎందుకు తీసుకున్నారో ఇప్ప‌టికీ అర్థం కాని విష‌యం. అయితే మొత్తం వ్య‌వ‌హారంలో ఇప్ప‌టి వ‌ర‌కు స‌మంత త‌మ జీవితాల‌పై ఎన్నో కామెంట్స్ చేస్తూ సందేశాలు పెట్టింది. అలాగే ఈమ‌ధ్యే కాఫీ విత్ క‌ర‌ణ్ అనే షోలో పాల్గొని చాలా ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. క‌ర‌ణ్ జోహార్ స‌మంత భ‌ర్త అని సంబోధిస్తే.. కాదు.. మాజీ భ‌ర్త అనాల‌ని సూచించింది. అలాగే త‌మ ఇద్ద‌రినీ ఒకే గ‌దిలో పెడితే ప‌దునైన వ‌స్తువుల‌ను ఉంచ‌కూడ‌ద‌ని కామెంట్స్ చేసింది. అంటే స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు ప్రేమికుల్లా ఉండి ఎంత బ‌ద్ద శ‌త్రువులుగా మారారో.. ఆమె వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

అయితే ఈ మొత్తం వ్య‌వ‌హారంలో నాగ‌చైత‌న్య మొద‌టి నుంచి సైలెంట్‌గానే ఉన్నాడు. అలాగే థాంక్ యూ చిత్ర ప్ర‌మోషన్ల‌లో భాగంగా స‌మంత గురించి ప్ర‌శ్న‌లు వ‌చ్చినా ఆమె మంచిద‌ని చాలా కూల్‌గానే స‌మాధానాలు చెప్పాడు. కానీ స‌మంత మాత్రం అత‌న్ని శ‌త్రువుగానే చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో నీకు, మా హీరో చైతూకు ఎంతో తేడా ఉంద‌ని.. అక్కినేని ఫ్యాన్స్ ఆమెపై విమ‌ర్శ‌ల వర్షం కురిపించారు. అయితే నెటిజ‌న్లు మాత్రం నాగ‌చైత‌న్య జీవితం ఇలా అవ‌డానికి కార‌ణం నాగార్జున‌నే అని అంటున్నారు. ఆయ‌న వ‌ల్లే చైతూ స‌మంత‌ను కోల్పోయాడ‌ని అంటున్నారు. ఇక దీనికి కార‌ణాల‌ను కూడా చెబుతున్నారు.

Nagarjuna may be the reason for Naga Chaitanya divorce says netizen
Nagarjuna

నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి భార్య ల‌క్ష్మితో విడాకుల అనంత‌రం హీరోయిన్‌గా ఉన్న అమ‌ల‌ను ఆయ‌న వివాహం చేసుకున్నారు. త‌రువాత అఖిల్ జన్మించాడు. ల‌క్ష్మికి అంత‌కు ముందే నాగ‌చైత‌న్య పుట్టాడు. అయితే విడాకుల వ‌ల్ల చైతూ త‌ల్లిదండ్రుల వ‌ద్ద క‌ల‌సి పెరిగే అవ‌కాశం లేకుండా పోయింద‌ని.. దీంతో ఇద్ద‌రితోనూ అటాచ్‌మెంట్ త‌క్కువేన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే కుటుంబంలో ఎలా ఉండాలో చైతూకు తెలియ‌ద‌ని.. అందువ‌ల్లే స‌మంత‌కు దూర‌మయ్యాడ‌ని అంటున్నారు. అదే ఇద్ద‌రు త‌ల్లిదండ్రుల వ‌ద్ద పెరిగి ఉంటే చైత‌న్య క‌థ మ‌రోలా ఉండేద‌ని.. స‌మంత‌కు స‌ర్ది చెప్పో.. మ‌రో ర‌కంగానో ఇద్ద‌రూ క‌ల‌సి ఉండేవార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే చైత‌న్య జీవితం ప్ర‌స్తుతం ఇలా అయ్యేందుకు ప‌రోక్షంగా నాగార్జున కూడా కార‌ణ‌మ‌య్యార‌ని ఆరోపిస్తున్నారు. అయితే చైతూ, స‌మంత‌ల భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now