Naga Chaithanya : కొత్త అపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ అవుతున్న చైతూ ? ఒంట‌రిగానే ఉండేందుకు నిర్ణ‌యం ?

October 10, 2021 10:08 PM

Naga Chaithanya : స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోతార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ వార్త‌ల‌ను వారు నిజం చేశారు. తాము విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో విడాకుల అనంత‌రం ఇద్ద‌రూ తీవ్ర‌మైన బాధ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. స‌మంత ఓ వైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా భావోద్వేగ‌మైన పోస్టుల‌ను పెడుతుంటే.. మ‌రోవైపు నాగ‌చైత‌న్య వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నా.. ముభావంగా క‌నిపిస్తున్నారు.

Naga Chaithanya may move into new apartment to live lonely

అయితే ఈ ఇద్ద‌రూ విడిపోక‌ముందు నెల రోజుల ముందు నుంచే విడిగా ఉంటున్నారు. అప్పుడే అంద‌రికీ డౌట్ వ‌చ్చింది. కానీ విడాకులు తీసుకున్నాక ఆ అనుమాన‌మే నిజం అయింది. ఇక వివాహం అయ్యాక ఇద్ద‌రూ క‌లిసి గ‌చ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అది స‌మంత‌దే. దీంతో చైతూ జూబ్లీహిల్స్‌లో భారీ ఖ‌ర్చుతో ఓ బంగ్లా కొన్నారు. దాని రెనొవేష‌న్ వ‌ర్క్ కూడా ఇంకా జ‌రుగుతోంది. అది పూర్త‌య్యేందుకు ఏడాది ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

ఆ ఇంటి ప‌ని పూర్త‌య్యాక చైతూ స‌మంత‌తో క‌లిసి అందులోకి మారుదామ‌ని అనుకున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు స‌మంత‌తో ఆమె అపార్ట్‌మెంట్‌లో ఉండ‌వ‌చ్చ‌ని వారిద్ద‌రూ క‌ల‌సి ఉంటున్నారు. అయితే విడిపోవ‌డానికి నెల రోజుల ముందు నుంచి స‌మంత ఆ అపార్ట్‌మెంట్‌లో ఒంట‌రిగా ఉంటుండ‌గా.. చైతూ మాత్రం ఓ విలాస‌వంత‌మైన హోట‌ల్‌లో ఉంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

అయితే కొత్త బంగ్లా సిద్ధం కాకుండానే వీరిద్ద‌రూ విడిపోయారు. అయిన‌ప్ప‌టికీ చైతూ ఆ బంగ్లా కొన్నాడు క‌నుక అందులో ఒంట‌రిగానే ఉండేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని టాక్‌. కానీ అది పూర్త‌య్యేందుకు ఇంకా సంవ‌త్స‌రం అయినా ప‌డుతుంది క‌దా.. అప్ప‌టి వ‌ర‌కు త‌ల్లిదండ్రుల వ‌ద్ద ఉండ‌డం ఇష్టం లేని చైతూ న‌గ‌రంలోనే ఓ పోష్ ఏరియాలో ఇంకో అపార్ట్‌మెంట్‌ను తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో బంగ్లా సిద్ధం అయ్యే వ‌ర‌కు చైతూ ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండ‌నున్నాడ‌ని స‌మాచారం. ఏది ఏమైనా ఈ బ్యూటిఫుల్ క‌పుల్ విడిపోవ‌డం మాత్రం ఇప్ప‌టికీ ఇంకా చాలా మంది అక్కినేని ఫ్యాన్స్‌కు న‌చ్చ‌డం లేదు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment