Naga Chaithanya : సమంతని నాగచైతన్య పెళ్లి చేసుకుంది.. అందుకోసమేనా..?

November 15, 2021 4:48 PM

Naga Chaithanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా కొనసాగుతున్న వారిలో అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఒకటి. వీరు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకుని అనంతరం పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగు సంవత్సరాల వీరి వైవాహిక జీవితంలో పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే సమంతని నాగ చైతన్య పెళ్లి చేసుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని తెలుస్తోంది.

Naga Chaithanya married samantha for that reason

నాగచైతన్య తల్లి శ్రీలక్ష్మి చెన్నైలో నివసిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే చెన్నైలో తన తల్లిని చూడటం కోసం నాగచైతన్య తరచూ అక్కడికి వెళ్లేవారు. ఆ సమయంలోనే తన తల్లి ఇంటి పక్కన సమంత అనే పేరు ఉండే ఒక అమ్మాయి ఉండేదట. అయితే ఆమెను చూడగానే ఇష్టపడ్డ నాగచైతన్య  ఆమెకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడట. కానీ ఆమె అతని లవ్‌ను తిరస్కరించిందట.

ఇక ఇదే విషయాన్ని నాగచైతన్య తన తల్లి దగ్గర చెప్పుకుని వాపోయాడట. లవ్‌ ఫెయిల్యూర్‌ సహజమే అని ఆమె సర్ది చెప్పిందట. అయితే తరువాత హీరోయిన్‌ సమంత ఏం మాయ చేశావేతో చైతూకు పరిచయం అయింది. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

ఈ క్రమంలో ఇదే విషయాన్ని తన తల్లి దగ్గర చెప్పడంతో.. సమంత అనే పేరుండే అమ్మాయి తిరస్కరించింది కదా..  కేవలం సమంత అన్న పేరు ఉండటం వల్ల ఈ హీరోయిన్‌ను ప్రేమించావా.. అని అడగడంతో.. పేరు మాత్రమే కాదు, తను కూడా నచ్చడంతో తనని ప్రేమించానని.. నాగచైతన్య చెప్పాడట. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

అయితే మొదటగా పరిచయం అయిన సమంత అనే పేరున్న అమ్మాయి.. నాగచైతన్యను ఎలా రిజెక్ట్ చేసిందో.. ఇప్పుడు హీరోయిన్‌ సమంత కూడా నాగచైతన్యతో అదేవిధంగా తెగతెంపులు చేసుకుంది. దీంతో చైతూకు అసలు ఈ పేరు అచ్చిరాలేదని అంటున్నారు. కేవలం తాను మొదట ప్రేమించిన అమ్మాయి పేరు ఈ సమంతకు ఉండడంతోనే ఈ సమంతను నాగచైతన్య ప్రేమించాడని తెలుస్తోంది. అయినా అతనికి అదృష్టం కలసి రాలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now