గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Naga Chaitanya : విడాకులు తీసుకున్నా.. స‌మంత‌ కోసం చైతూ ఇంకా ఆ పని చేస్తున్నాడ‌ట..?

Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలిచేవారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు…

Naga Chaitanya : విడాకులు తీసుకున్నా.. స‌మంత‌ కోసం చైతూ ఇంకా ఆ పని చేస్తున్నాడ‌ట..?

Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలిచేవారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులతోపాటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న‌ ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.

వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ, నెట్టింట ఎప్పుడూ ఏదో వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత.. నాగచైతన్యపైన లేనిపోని నిందలు వేసింది. కానీ నాగచైతన్య మాత్రం సమంతను ఒక్కమాట కూడా అనలేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అంటూ కామెంట్ చేశాడు. అంతేకానీ సమంతలాగా ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ గా మారింది.

Naga Chaitanya growing plants which is liked by Samantha
Naga Chaitanya

విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య.. సమంత కోసం తనకి ఇష్టమైన పనులు చేస్తున్నాడని తెలుస్తుంది. సమంతకి చెట్లు అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. సమంతకి చెట్లు, గ్రీనరీ, నేచర్ అంటే చాలా ఇష్టం. సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు కొంచెం సమయం దొరికినా గార్డెనింగ్ చేసేవారట. ఈ క్రమంలోనే ఇద్దరూ విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉన్న టైంలో పెంచుకున్న మొక్కలను నాగచైతన్య భద్రంగా తన దగ్గర దాచుకున్నాడట. ఇప్పటికీ వాటికి నీరు పోస్తూ మంచి కండిషన్లో పెట్టాడట చైతూ. సామ్ వదిలేసినా కానీ చైతన్య ఇంకా ఆమె జ్ఞాపకాలతోనే ఉన్నాడంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి