గురువారం, జూన్ 11, 2026
విద్య & ఉద్యోగం

డిగ్రీతో నాబార్డ్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!

నిరుద్యోగులకు నాబార్డ్ సంస్థ తీపి వార్తను తెలిపింది నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ సంస్థలలో వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 162 మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయడం కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.…

డిగ్రీతో నాబార్డ్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!

నిరుద్యోగులకు నాబార్డ్ సంస్థ తీపి వార్తను తెలిపింది నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ సంస్థలలో వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 162 మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయడం కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

తాజాగా విడుదలైన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 162 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో గ్రేడ్‌-ఏ అసిస్టెంట్‌ మేనేజర్, గ్రేడ్‌-బీ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరనుంది. ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు https://nabard.org/ అధికారక వెబ్ సైట్ సంప్రదించాలి.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారే ఉండాలి. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.జులై 17 2021వ తేదీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 7 2021 దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించవలెను.https://nabard.org/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి