Mokshagna : మహేష్ బాబు మ‌ల్టీప్లెక్స్‌లో మెరిసిన నందమూరి మోక్షజ్ఞ.. ఏం మార‌లేదుగా.. వీడియో వైరల్..!

October 8, 2022 11:40 AM

Mokshagna : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అఫిషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. ఇప్పటికే అక్కినేని, మెగా, అల్లు, ఘట్టమనేని ఫ్యామిలీల నుంచి నట వారసులు వచ్చి స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఆ జనరేషన్ వారిలో బాలయ్య ఒక్కడే ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడో, ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది సస్పెన్స్ గా మారింది.

చిన్న వయసే కదా, హీరోగా రావడానికి ఇంకా టైముందిలే అని కొంతమంది అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు. సినిమాల్లో కనిపించకపోయినా కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించడు. కానీ అప్పుడప్పుడూ మెరుపులా మెరిసి వెళ్లిపోతుంటాడు. మొన్నా మధ్య తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో తండ్రితో కలిసి జన్మదిన వేడుకలు చేసుకుని సందడి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు థియేటర్ లో కనిపించాడు. మాదాపూర్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్ లో నందమూరి మోక్షజ్ఞ దర్శనమిచ్చాడు.

Mokshagna yet again appeared outside in theatre video viral
Mokshagna

పక్కన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేకుండా ఒక్కడే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి ఏ సినిమా చూడ్డానికి వచ్చాడో తెలియదు గానీ మోక్షజ్ఞని చూసిన జనం ఒక్కసారిగా చుట్టుముట్టి సెల్ఫీలు తీసుకున్నారు. మోక్షజ్ఞ థియేటర్ లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నందమూరి అభిమానులు.. యంగ్ లయన్ వస్తోంది చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో.. అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో.. చూడాలి.

https://youtu.be/KSh97okbfWM

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment