గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Mega Family : మెగా ఫ్యామిలీ క్రిస్మ‌స్ వేడుక‌.. శ్రీజ భ‌ర్త మిస్ కావ‌డంతో అందరిలోనూ కొత్త అనుమానాలు..

Mega Family : మెగా వార‌సులంద‌రూ ప‌లు వేడుక‌ల‌లో తెగ సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వారి ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయో లేదో తెగ వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా మెగా క్రిస్మ‌స్ వేడుక‌కి సంబంధించిన ఫొటోని…

Mega Family : మెగా ఫ్యామిలీ క్రిస్మ‌స్ వేడుక‌.. శ్రీజ భ‌ర్త మిస్ కావ‌డంతో అందరిలోనూ కొత్త అనుమానాలు..

Mega Family : మెగా వార‌సులంద‌రూ ప‌లు వేడుక‌ల‌లో తెగ సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వారి ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయో లేదో తెగ వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా మెగా క్రిస్మ‌స్ వేడుక‌కి సంబంధించిన ఫొటోని రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. అంతేకాదు ఈ ఫొటో చూసి మెగా అభిమానులు ప‌లు అనుమానాలను వ్య‌క్తం చేస్తున్నారు.

Mega Family Christmas celebrations srija husband missed

మెగా కుటుంబంలోని యంగ్ జనరేషన్ అంతా ఒక దగ్గర చేరి క్రిస్మస్ వేడుకలు సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ వేడుకలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ నుంచి వైష్ణవ్, నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహ, నిహారిక భర్త, వారి సోదరిలు ఇలా అంతా కలిపి యంగ్ జనరేషన్ అంతా సింగిల్ ఫొటోలో కనిపించారు. ఇది చూడటానికి ఎంతో ప్లెజెంట్ గా ఉందని చెప్పాలి. దీంతో ఈ పిక్ అయితే ఇపుడు మెగా ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది.

అయితే శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ మాత్రం ఈ పిక్ లో మిస్ అయ్యారు. గతంలో మెగా కజిన్స్ దీపావళి సెలెబ్రేషన్స్ లో, మరొక సందర్భంలో కూడా ఇదే విధంగా కలిసి పోజులిచ్చారు. క‌ళ్యాణ్ దేవ్ ఈ మ‌ధ్య వ‌రుస ఈవెంట్స్ లో మిస్ అవుతుండ‌డంపై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల శ్రీజ, క‌ళ్యాణ్ దేవ్ విడిపోతున్న‌ట్టు వార్త‌లు రాగా, ఈ పిక్ చూస్తుంటే అది నిజ‌మేనా అనే అనుమానం క‌లుగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి