Samantha : మంచు విష్ణు ప్ర‌క‌ట‌న‌.. స‌మంత‌కు బూస్టింగ్‌..

October 24, 2021 10:16 PM

Samantha : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు స‌మంత ప్ర‌క‌టించిన త‌రువాత‌.. నిజానికి ఆమెనే ఎక్కువ మంది నిందించారు. ఆమె అబార్ష‌న్ చేయించుకుంటానంద‌ని, పిల్ల‌ల్ని క‌న‌డం ఇష్టం లేద‌ని, స‌రోగ‌సీకి వెళ్దామ‌ని అన్న‌ద‌ని.. ఆమె న‌టించిన సిరీస్ లు, సినిమాల్లో బోల్డ్ క‌నిపించ‌డం వ‌ల్లే.. అని ఇలా ర‌క ర‌కాలుగా వారి విడాకుల‌కు స‌మంత‌నే నిందించారు. అయితే కొన్ని యూట్యూబ్ చానల్స్ ఈ విష‌యంలో హ‌ద్దు మీరి ప్ర‌వ‌ర్తించాయి. దీంతో వారిపై ప‌రువు న‌ష్టం కేసు వేయ‌గా.. అది కోర్టులో విచార‌ణ‌లో ఉంది.

manchu vishnu said maa will open legal cell boosting for Samantha

అయితే తాజాగా మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. వేధింపుల‌ను ఎదుర్కొనే మా మ‌హిళా స‌భ్యుల విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అలాంటి మ‌హిళా స‌భ్యుల‌కు మా అసోసియేష‌న్ అండ‌గా ఉంటుంద‌న్నారు. వ్యూస్ పెంచి పాపుల‌ర్ అవ‌డం కోసం కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్ హీరోయిన్లు, ఇత‌ర న‌టీమ‌ణుల‌పై లేని పోని త‌ప్పుడు క‌థ‌నాల‌ను వీడియోల‌లో ప్ర‌సారం చేస్తున్నాయ‌ని, త‌ప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి ప్ర‌తిష్ట‌ను దిగ‌జారుస్తున్నాయ‌ని.. అలాంటి చాన‌ల్స్‌ను విడిచిపెట్ట‌బోమ‌ని.. మంచు విష్ణు స్ప‌ష్టం చేశారు.

ఇక యూట్యూబ్ చాన‌ల్స్ వేధింపుల వ‌ల్ల ఇబ్బందుల‌కు గుర‌య్యే మా మ‌హిళా స‌భ్యుల కోసం ఒక లీగ‌ల్ సెల్ ఏర్పాటు చేసి స‌హాయం అందిస్తామ‌ని తెలిపారు. అయితే మంచు విష్ణు చేసిన ప్ర‌క‌ట‌న స‌మంత‌కు వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఏది ఏమైనా.. విడాకుల ప్ర‌క‌ట‌న‌తో తీవ్ర డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తున్న స‌మంత ప్ర‌స్తుతం ఆధ్యాత్మిక యాత్ర‌లు చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ ప‌లు సినిమాలకు సంత‌కం చేసి ఉత్సాహంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment