Manchu Lakshmi : స్టార్ హీరోని పెళ్ళి చేసుకోవాల్సిన మంచు లక్ష్మీ.. ఇలా ఎందుకు అయ్యిందంటే..?

October 4, 2022 11:55 AM

Manchu Lakshmi : కలెక్షన్ కింగ్ వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ షోస్ మరియు కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ లో యాంకర్ గా కూడా అలరిస్తుంది మంచు లక్ష్మీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటుంది. అయితే మంచు లక్ష్మీ పెట్టిన అనేక పోస్ట్స్ వైరల్ అవుతూ ట్రోలింగ్ కి గురవుతుంటాయి. మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు కానీ మంచు లక్ష్మీ ఎక్కువగా పోస్టులు చేయడం వల్ల ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతుంది.

అయితే ఆ మధ్య చీరకట్టులో మాస్ డాన్స్ వేస్తూ ఉర్రూతలూగించింది లక్ష్మీ. జీవితం ఎప్పుడూ మనం అనుకున్నంత సాఫీగా సాగిపోదు. అప్పుడప్పుడూ మనం అనుకున్న వాటికి భిన్నంగా జరుగుతూ ఉంటాయి. అలాగే జరిగింది మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ విషయంలో. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. మంచు లక్ష్మీని మోహన్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరో గా ఉన్న ఓ స్టార్ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. ఆయన మంచు ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని, దగ్గర బంధువు అని తెలుస్తుంది.

Manchu Lakshmi rejected to marry star hero what is the reason
Manchu Lakshmi

అయితే మంచులక్ష్మీ నాకు అప్పుడే పెళ్లి వద్దని చదువుకుంటానని విదేశాలకు వెళ్లిపోయిందట. అంతేకాదు తనకు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఖరాఖండిగా చెప్పేసిందట. ఈ క్రమంలోనే బడా ఫ్యామిలీకి కోడలు అయ్యే చాన్స్ మిస్ చేసుకుంది మంచు లక్ష్మీ అంటూ ఓ న్యూస్ గతంలో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మరోవైపు ఆహా వారితో ఓ క్రేజీ కుకింగ్ షోకు హోస్ట్ గా చేస్తుంది. భర్త, ఓ పాపతో చాలా హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది లక్ష్మీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment