గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Love Story : వారెవ్వా.. లవ్‌ స్టోరీ సినిమా.. బుల్లితెరపై బ్రహ్మాండమైన టీఆర్‌పీలను రాబట్టింది..!

Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిచిన చిత్రం ‘లవ్ స్టోరీ’ . సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.…

Love Story : వారెవ్వా.. లవ్‌ స్టోరీ సినిమా.. బుల్లితెరపై బ్రహ్మాండమైన టీఆర్‌పీలను రాబట్టింది..!

Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిచిన చిత్రం ‘లవ్ స్టోరీ’ . సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది. స్టార్ మా లో ప్రసారం అయిన ఈ చిత్రానికి తొలిసారి సాలిడ్ టీఆర్పీని రాబట్టింది.

Love Story movie got wonderful trps on television

ఈ చిత్రం తొలిసారిగా 18.01 టీఆర్పీని రాబట్టి బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లవ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టడం విశేషం. రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. అమెరికాలో 224 లొకేష‌న్స్‌లో ల‌వ్‌స్టోరీ ప్రీమియ‌ర్స్ వేస్తే, 3,07,103 డాల‌ర్స్ వసూలు చేసింది.

ల‌వ్ స్టోరీ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా చైతూ ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉన్నాడు. సాయి పల్ల‌వి న‌టించిన శ్యామ్ సింగ రాయ్ విడుద‌లైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి