Lord Shiva Flowers : కార్తీక మాసంలోనే కాదు.. ఇతర సమయాల్లోనూ చాలా మంది శివున్ని పూజిస్తుంటారు. ప్రతి సోమవారం పూజలు చేసి ఉపవాసాలు ఉంటారు. శివుడికి సోమవారం పూజలు చేయడం వల్ల మరుజన్మ ఉండదని.. నేరుగా కైలాసానికి చేరుకుంటారని చెబుతుంటారు. అందుకనే చాలా మంది మోక్షం కోసం శివున్ని పూజిస్తారు. అయితే శివున్ని పూజించేందుకు పలు రకాల పుష్పాలను వాడాలి. వాటిని వాడడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. శివుడు సంతోషిస్తాడు. మనల్ని అనుగ్రహిస్తాడు. శివానుగ్రహం కోసం ఏయే పుష్పాలను పూజలకు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పరమ శివుడి పూజలకు వాడాల్సిన పుష్పాలు.. కరవీరం (గన్నేరు), అర్కం (జిల్లేడు), మందారం, శమీ (జమ్మి), బొగడ, మోదుగ, ఇప్ప, వెంపలి, బిల్వం (మారేడు), అపామార్గం (ఉత్తరేణి), కలిగొట్టు, అశోకం, అవిసె, ఉమ్మెత్త, కొండగోగు, కడిమి, నల్ల గోరింట, సురపొన్న, ఎర్ర గోరింట, ఎర్ర దేవకాంచనం, సంపెంగ, మల్లి, పండు గురివెంద, జాజి, తుమ్మి, నూరు రేకుల పద్మం, వెయ్యి రేకుల పద్మం, తెల్ల కలువ, నల్ల కలువ, తాపింఛం, తులసి.. ఈ మొక్కలు లేదా చెట్లకు చెందిన పుష్పాలను శివ పూజకు వాడాలి. దీంతో సకల శుభాలు కలుగుతాయి. శివుడు అనుగ్రహిస్తాడు. శివున్ని ఈ పుష్పాలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.
అయితే పైన తెలిపిన పుష్పాల్లో అన్నింటినీ వాడాలని ఏమీ లేదు. మనకు అందుబాటులో ఉండేవాటిని వాడవచ్చు. ప్రతి సోమవారం ఈ పుష్పాలతో పూజలు చేస్తూ ఉపవాసం ఉండాలి. దీని వల్ల అనుకున్నది నెరవేరుతుంది. ఎంతో పుణ్యం లభిస్తుంది. కష్టాల నుంచి బయట పడవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…