OTT : ఈ వారం ఓటీటీల్లో రానున్న మూవీలు ఇవే..!

July 25, 2022 2:06 PM

OTT : ఈ మ‌ధ్య కాలంలో థియేట‌ర్ల‌లోక‌న్నా ఓటీటీల్లోనే సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్రేక్ష‌కులు కూడా థియేట‌ర్ల కంటే ఓటీటీల్లో మూవీలు చూడ‌డ‌మే బెట‌ర్ అని భావిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అనేక సినిమాల‌కు క‌లెక్ష‌న్లు మాత్రం రావ‌డం లేదు. ఇక వారం మారేకొద్దీ కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు.. ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఓటీటీల ప‌ట్ల స‌హ‌జంగానే ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇస్రో సైంటిస్టు నంబి నారాయ‌ణ‌న్ జీవిత‌గాథ ఆధారంగా తెర‌కెక్కిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ అనే మూవీని ఈ వారంలోనే ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో ఆర్‌.మాధ‌వ‌న్ న‌టించ‌గా.. ఈ మూవీని ఈ నెల 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయ‌నున్నారు. అలాగే విజ‌య్ సేతుప‌తి, నిత్య మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన 19 (1)(a) అనే మూవీ కూడా ఈ వార‌మే ఓటీటీలోకి రానుంది. దీన్ని ఈ నెల 29వ తేదీన డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

list of movies releasing on OTT apps on 29th July 2022
OTT

క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత్ శెట్టి న‌టించిన 777 చార్లి అనే మూవీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీని ఈ నెల 29వ తేదీన వూట్ అనే యాప్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్ న‌టించిన గుడ్ ల‌క్ జెర్రీ అనే మూవీని ఈ నెల 29వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. దీన్ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. ఇలా ప‌లు మూవీలు ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి.

ott

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment