గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Kushboo Sundar : టాలీవుడ్ స్టార్ హీరోకి దిమ్మ తిరిగేలా చేసిన కుష్బూ.. ఇంత‌కీ అస‌లు ఏమైందంటే..?

Kushboo Sundar : సౌత్ సినిమా ఇండస్ట్రీలో 1980-90ల‌లో ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ కుష్బూ. వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన కుష్బూ తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.…

Kushboo Sundar : టాలీవుడ్ స్టార్ హీరోకి దిమ్మ తిరిగేలా చేసిన కుష్బూ.. ఇంత‌కీ అస‌లు ఏమైందంటే..?

Kushboo Sundar : సౌత్ సినిమా ఇండస్ట్రీలో 1980-90ల‌లో ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ కుష్బూ. వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన కుష్బూ తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తమిళనాడులో కుష్బూ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా అభిమానులు ఆమెకు గుడి కట్టేశారు. అంతటి క్రేజ్ ఉన్న కుష్బూ కూడా కెరీర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్ బాధితురాలే అట. ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది ఓపెన్ సీక్రెట్. ఇటీవల చాలామంది హీరోయిన్లు ధైర్యంగా ముందుకొచ్చి దీని గురించి స్పందించిన విషయం తెలిసిందే.

అయితే కుష్బూ తన మొదటి సినిమాలో తనపై జరిగిన అసభ్య ప్రవర్తన గురించి, ఒక స్టార్ హీరో వల్ల తనకెదురైన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. వెంకటేష్ కలియుగ పాండవులు సినిమా చేసేప్పుడు సెట్‌లో తనతో ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడని ఎమోషనల్ అయింది కుష్బూ. షూటింగ్ ముగించుకుని మేడపైకి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒకడు తన వెనక భాగాన్ని తాకాడు. కోపంతో ఆమె వాడి చెంప పగలకొట్టింది. అప్పుడు అక్కడ సురేష్ బాబు కూడా ఉన్నారు. సెట్‌లో అందరూ నాకే సపోర్ట్ గా నిలిచారు అంటూ తన డెబ్యూ మూవీలో ఎదురైన‌ చేదు సంఘటనని గుర్తు చేసుకుంది కుష్బూ.

Kushboo Sundar sensational comments on a Tollywood actor
Kushboo Sundar

ఇక ఆ తర్వాత మరో సినిమా అనుభవం గురించి స్పందిస్తూ.. ఏకంగా కమిట్మెంట్ అడిగారని షాకింగ్ కామెంట్స్ చేసింది. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరో అని చెప్పింది. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో తనను కమిట్ మెంట్ అడిగాడ‌ని.. దాంతో తనకు కోపం వచ్చిందని.. వెంటనే నీ కూతుర్ని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే నేను కమిట్మెంట్ ఇస్తా అని చెప్పానని తెలిపింది. తాను ఇచ్చిన కౌంట‌ర్ తో ఆ హీరో ఫేస్ మాడిపోయింద‌ని.. ఆ దెబ్బ‌తో త‌న‌తో జాగ్ర‌త్త‌గా ఉండేవాడ‌ని కూడా తెలిపింది. అయితే ఆ స్టార్ హీరో పేరును మాత్రం కుష్బూ భయ‌ట‌పెట్టలేదు. ఇది తెలిసిన‌ నెటిజన్లు ఇంతకీ ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరా అని చర్చించుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి