గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Krithi Shetty : గోల్డెన్ చాన్స్‌ను కొట్టేసిన కృతి శెట్టి.. ఏకంగా బాలీవుడ్ సినిమాలోనే..?

Krithi Shetty : ఉప్పెన సినిమా ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ కృతి శెట్టి బేబ‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కులకు చాలా ద‌గ్గ‌రైంది. ఈమె గ‌తేడాది నుంచి చేస్తున్న సినిమాలు అన్నీ హిట్ అవుతున్నాయి. ఈ మ‌ధ్యే వ‌చ్చిన…

Krithi Shetty : గోల్డెన్ చాన్స్‌ను కొట్టేసిన కృతి శెట్టి.. ఏకంగా బాలీవుడ్ సినిమాలోనే..?

Krithi Shetty : ఉప్పెన సినిమా ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ కృతి శెట్టి బేబ‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కులకు చాలా ద‌గ్గ‌రైంది. ఈమె గ‌తేడాది నుంచి చేస్తున్న సినిమాలు అన్నీ హిట్ అవుతున్నాయి. ఈ మ‌ధ్యే వ‌చ్చిన బంగార్రాజు సినిమాతోపాటు అంత‌కు ముందు వ‌చ్చిన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాలు ఘ‌న విజ‌యాన్ని సాధించాయి. దీంతో కృతిశెట్టికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఇక తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్రకారం.. కృతిశెట్టికి బాలీవుడ్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

Krithi Shetty  reportedly got a bollywood movie offer
Krithi Shetty

తెలుగులో శ్యామ్ సింగరాయ్ సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో నానితోపాటు కృతి శెట్టి, సాయిప‌ల్ల‌విలు న‌టించారు. అయితే ఇదే సినిమాను హిందీలో షాహిద్ క‌పూర్ రీమేక్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. ఆ సినిమాలో కృతి శెట్టిని తిరిగి అదే రోల్ కోసం అడిగార‌ట‌. దీంతో ఈమె ఓకే చెప్పింద‌ని కూడా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.

ఇక కృతి శెట్టి ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. రామ్ ప‌క్క‌న ది వారియ‌ర్ అనే చిత్రంలో కృతి న‌టిస్తోంది. అలాగే నితిన్‌తో క‌లిసి మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అనే సినిమా చేస్తోంది. దీంతోపాటు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీలోనూ కృతి శెట్టి న‌టిస్తోంది. ఈ క్ర‌మంలో వ‌రుస సినిమాల‌తో ఈమె ఇప్పుడు ఎంతో బిజీగా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి