Krithi Shetty : ఉప్పెన బ్యూటీ హ‌ద్దులు చెరిపేస్తుందిగా.. ఏకంగా ఆ హీరోకి లిప్‌లాక్ ఇచ్చేసింది..!

November 18, 2021 6:46 PM

Krithi Shetty : ఉప్పెన సినిమాతో అందరి మ‌న‌సులు గెల‌చుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ అమ్మ‌డు తాజాగా నానితో శ్యామ్ సింగ‌రాయ్ చేస్తోంది. ఈ సినిమా నాని కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా రూపొందింది. ఇక పీరియాడిక్ థ్రిల్లర్ గా తెరపైకి రాబోతున్న శ్యామ్ సింగరాయ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చాలా విభిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది.

Krithi Shetty given lip kiss to nani

టీజర్ లో నాని రెండు విభిన్నమైన పాత్రలతో అలరించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలో పూర్వజన్మ, ప్రస్తుత జన్మ అంశాలను కూడా హైలెట్ గా చూపించబోతున్న ట్లు అనిపిస్తోంది. దేవుడే రాక్షసుడిగా మారితే.. పురాణకాలంలోని ఆచారాల వలన స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఆ తర్వాత ఒక చదువుకున్న వ్యక్తి వారిని ఏ విధంగా ఆ దేవుడి నుంచి రక్షించాడు.. అనే పాయింట్ కూడా హైలెట్ చేశారని తెలుస్తోంది.

నాని.. కృతి శెట్టి కి లిప్ కిస్ ఇచ్చిన సీన్ కూడా టీజర్ లో హైలెట్ గా నిలిచింది.. చూస్తుంటే సినిమాలో థ్రిల్లర్ అంశాలతోపాటు మంచి ప్రేమకథ, రొమాన్స్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తెరపై స్కిన్ షోలు, హాట్ రొమాన్స్‌లకు తాను ఒప్పుకోనని ముందుగానే చెప్పిన కృతి ఇలా ఓ స్టార్ హీరోతో లిప్ లాక్ చేయడం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. చూస్తుంటే ఈ అమ్మ‌డు రానున్న రోజుల‌లో హాట్ షోతో కేక పెట్టిస్తుంద‌ని అర్ధ‌మ‌వుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now