గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Krishnam Raju Family : కృష్ణంరాజు ఆస్తి విష‌యంలో సంచ‌ల‌న విష‌యం బ‌య‌టకు..?

Krishnam Raju Family : ప్రముఖ నటుడు కృష్ణంరాజు వెండితెర మీద రెబల్ స్టార్ అయితే, తెర వెనుక మర్యాద రామన్నలా ఉంటారని సినీ పరిశ్రమలో ఉన్న టాక్. రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. దాదాపు…

Krishnam Raju Family : కృష్ణంరాజు ఆస్తి విష‌యంలో సంచ‌ల‌న విష‌యం బ‌య‌టకు..?

Krishnam Raju Family : ప్రముఖ నటుడు కృష్ణంరాజు వెండితెర మీద రెబల్ స్టార్ అయితే, తెర వెనుక మర్యాద రామన్నలా ఉంటారని సినీ పరిశ్రమలో ఉన్న టాక్. రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. దాదాపు 60 ఏళ్లకు పైగా ఆయన సినీ జీవితం కొనసాగింది. సంపన్న కుటుంబంలో జన్మించడం వల్ల వారసత్వంగా ఆయనకు కొంత ఆస్తి ఉంది కానీ ఇన్నాళ్లు సినిమాల్లో కూడా కొంత సంపాదించారు. కృష్ణంరాజుకు తండ్రి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి వచ్చింది. ప్రస్తుతానికి మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట ఒక రాజభవనం లాంటి భవనం కూడా ఉంది. ఇవి కాక సినీ పరిశ్రమ మొదట్లో చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ నివాసం ఉండేందుకు పలు ఆస్తులు కొనుగోలు చేశారు.

తర్వాత సినీ పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కృష్ణంరాజు ఇక్కడ కూడా ఖరీదైన నివాస భవనాలు కొనుగోలు చేశారు. చనిపోయే నాటికి ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో బస చేస్తున్నారు. దాని ఖరీదు సుమారు రూ.18 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇక ఇవి కాకుండా హైదరాబాదులో ఆయనకు పలు వ్యాపార సముదాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తన చివరి రోజుల్లో గడిపేందుకు మొయినాబాద్ దగ్గరలోని కనక మామిడి దగ్గరలో ఒక ఫామ్ హౌస్ కొనుగోలు చేశారు. అక్కడే ఆయన అంత్యక్రియలు జరిపారు. ఇక కృష్ణంరాజు కార్ల విషయానికి వస్తే ఆయనకు రూ.90 లక్షల విలువైన బెంజ్, రూ.40 లక్షల ఫార్చునర్, రూ.90 లక్షల విలువైన వోల్వో కార్లు ఉన్నాయి.

Krishnam Raju Family half property goes to first daughter
Krishnam Raju Family

కృష్ణంరాజు మొదట సీతాదేవి అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. ఆమె అనారోగ్యంతో కన్నుమూయడంతో శ్యామలా దేవిని రెండో వివాహం చేసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే కృష్ణంరాజు ఆస్తుల విలువ దాదాపు రూ.1000 కోట్ల దాకా ఉంటుందట. ఇదంతా కేవలం కృష్ణంరాజు తన పూర్వీకుల నుంచి, అలాగే స్వశక్తితో సంపాదించుకున్న ఆస్తి. ఇవి కాకుండా ప్రభాస్, ఆయన తండ్రి ఆస్తులు వేరేగా ఉన్నాయట. ఈ రూ.1,000 కోట్ల రూపాయలలో ముగ్గురు కూతుళ్లకు సమానంగా వాటాలు చెందాలని కృష్ణంరాజు వీలునామా రాసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రభాస్ కు తన తదనంతరం ఒక భవనం వచ్చే విధంగా కూడా ఆయన వీలునామాలో రాశారట.

అయితే చట్ట ప్రకారం మొదటి భార్యకి సగం ఆస్తి దక్కాలి. ఈ లెక్కన మొదటి భార్య కూతురికి సగం ఆస్తి దక్కాల్సి ఉంది. మరి ఆమెకు తల్లి లేకపోవడంతో ఆమెకు ఎంత ఆస్తి ఇచ్చి సర్ది చెబుతారో వేచి చూడాలి.  అయితే ఆస్తి కోసం మొద‌టి భార్య కుమార్తెకు, రెండో భార్య కుమార్తెల‌కు మ‌ధ్య త‌గ‌వులు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు. మ‌రి చివ‌ర‌కు ఏమ‌వుతుంద‌నేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి