గురువారం, జూన్ 11, 2026
వార్తలు

NTR : మరోసారి మంత్రి కొడాలి నాని నిర్మాణంలో సందడి చేయనున్న తారక్..?

NTR : ఏపీ మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొడాలి నాని రాజకీయాలతోపాటు సినిమాలపై కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఈ క్రమంలోనే కొడాలి నాని నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అదుర్స్…

NTR : మరోసారి మంత్రి కొడాలి నాని నిర్మాణంలో సందడి చేయనున్న తారక్..?

NTR : ఏపీ మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొడాలి నాని రాజకీయాలతోపాటు సినిమాలపై కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఈ క్రమంలోనే కొడాలి నాని నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అదుర్స్ సినిమాకు వల్లభనేని వంశీతో కలిసి నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందించిందో అందరికీ తెలిసిందే.

kodali nani reportedly producing a movie with NTR

అదుర్స్ సినిమా తర్వాత కొడాలి నాని మరే సినిమాలకు నిర్మాణ బాధ్యతలను చేపట్టలేదు. అయినప్పటికీ పలు సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినబడుతున్న సమాచారం ప్రకారం కొడాలి నాని మరొకసారి నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుమారుగా రూ.80 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు కొరటాల శివ సినిమాను నాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

మంత్రి కొడాలి నానితోపాటు మరొక ఎమ్మెల్యే కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియడం లేదు. ఈ విషయంపై కొడాలి నాని స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ నటించిన RRR సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి