Kangana Ranaut : వామ్మో.. భారీ ఎద అందాల‌ను మొత్తం బ‌య‌ట పెట్టిన కంగ‌నా.. ఫొటోలు వైర‌ల్‌..!

April 29, 2022 10:41 PM

Kangana Ranaut : బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్ ఎల్ల‌ప్పుడూ వివాదాల్లో నిలుస్తూనే ఉంటుంది. త‌న‌కు ఏ విష‌యం అయినా స‌రే అన్యాయం జరిగింది అనిపిస్తే ఆమె ఎంత‌టి వారిపైనైనా స‌రే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంది. ఇక ఈమె గ‌తంలో బాలీవుడ్ పేరు చెబితేనే అంత ఎత్తున ఎగిరి ప‌డేది. ముఖ్యంగా న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ విష‌యంలో ఈమె తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అత‌ని ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం బాలీవుడ్‌లో ఉన్న బంధు ప్రీతేన‌ని బ‌హిరంగంగానే బీటౌన్ పెద్ద‌ల‌పై విమ‌ర్శ‌లు చేసింది. ఇక సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఈ విష‌యంలో ఆమె ఫైర్ అవుతూనే ఉంటుంది.

Kangana Ranaut latest movie trailer launch photos viral
Kangana Ranaut

కంగ‌నా ర‌నౌత్ ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లో లేన‌ప్ప‌టికీ ఈమె మాత్రం బీజేపీకి ఔట్ రైట్ సపోర్ట్‌గా నిలుస్తుంటుంది. ఇక తాజాగా ఈమె ప‌లు రియాలిటీ షోల‌ను చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్‌లు, సినిమాల్లోనూ న‌టిస్తోంది. ఈమె చివ‌రిసారిగా న‌టించిన చిత్రం త‌లైవి. త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇక ప్ర‌స్తుతం ఈమె లాక‌ప్ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. కాగా తాజాగా ఈమె న‌టించిన ధాక‌డ్ అనే చిత్రానికి చెందిన ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ కార్య‌క్ర‌మానికి కంగ‌నా గ్లామ‌ర‌స్ డ్రెస్‌తో హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా ఆమె ధ‌రించిన దుస్తులు కేక పెట్టిస్తున్నాయి. అస‌లు ఎద అందాల‌ను ఏమాత్రం దాచుకోకుండా మొత్తం బ‌య‌ట పెట్టి కంగ‌నా చేసిన షో ప్ర‌తి ఒక్క‌రికీ కునుకు లేకుండా చేస్తోంది. ఈమె భారీ అందాల‌కు యువ‌త మ‌తులు పోతున్నాయి.

ఇక ఈ కార్యక్ర‌మంలో భాగంగా కంగ‌నా ప‌లువురు జ‌ర్న‌లిస్టులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పింది. ప్ర‌స్తుతం హిందీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్‌కు, క‌న్న‌డ న‌టుడు కిచ్చ సుదీప్‌కు మ‌ధ్య ట్వీట్ వార్ న‌డుస్తున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ ఇద్ద‌రిలో మీరు ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తారు ? అని జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్నించ‌గా.. అందుకు ఆమె బ‌దులిస్తూ.. అస‌లు దేశంలోని అన్ని భాష‌లూ సంస్కృతం నుంచే వ‌చ్చాయ‌ని.. అలాంట‌ప్పుడు మ‌నం భాష కోసం త‌న్నుకోవ‌డం, కొట్టుకోవ‌డం స‌రిగ్గా లేద‌ని.. క‌నుక సంస్కృతాన్ని దేశ భాష‌గా ప్ర‌క‌టిస్తే ఈ స‌మ‌స్య తొల‌గిపోతుంద‌ని స్పష్టం చేసింది. ఇక కంగ‌నా న‌టిస్తున్న తేజ‌స్‌, టికు వెడ్స్ షెరు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now