గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Kalyaan Dhev : జీవితంలో అలాంటి సంఘటనలు ఎదురైతే దారుణంగా ఉంటుంది.. వైరల్ అవుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్..

Kalyaan Dhev : మెగా డాటర్ శ్రీజను వివాహం చేసుకొని మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాడు కళ్యాణ్ దేవ్. అలాగే విజేత సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ మెగా కాంపౌండ్ కి చెందిన…

Kalyaan Dhev : జీవితంలో అలాంటి సంఘటనలు ఎదురైతే దారుణంగా ఉంటుంది.. వైరల్ అవుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్..

Kalyaan Dhev : మెగా డాటర్ శ్రీజను వివాహం చేసుకొని మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాడు కళ్యాణ్ దేవ్. అలాగే విజేత సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ మెగా కాంపౌండ్ కి చెందిన వాడా కాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల మధ్య నిజంగానే మనస్పర్థ‌లు వచ్చాయా ? లేదంటే విడాకులు తీసుకోబోతున్నారా ? సోషల్ మీడియాలో వీరిద్దరిపై జోరుగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ఇరు కుటుంబాలు స్పందించడం లేదు.

కళ్యాణ్ దేవ్ ప్రత్యేక సందర్భం ఉంటే తప్ప‌ సోషల్ మీడియాలో స్పందించడు. కానీ ఈ మధ్య తన వర్కవుట్లు, వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. మీరు ఒకరితో మాట్లాడాలని అనుకుంటారు.. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియదు, చాలా కష్టంగా నవ్వుతుంటారు, మధ్యలోనే ఆపేయాలని అనుకుంటారు, కానీ మీ పక్కన ఉన్న ఫ్రెండ్ మాత్రం ఇంకా నవ్వుతూనే ఉంటాడు, క్లాసుకు లేట్‌గా వెళ్తే.. మనం నడుచుకుంటూ వెళ్తుంటే.. అందరూ మనల్ని చూస్తుంటారు.. మనమేదో హత్య చేసినట్టు..!

Kalyaan Dhev emotional post social media viral
Kalyaan Dhev

మన ఏజ్ గురించి అడుగుతుంటారు.. మనం ఆలోచించి సమాధానం చెబుతాం, మనకు ఒకరితో ఇంకా మాట్లాడాలని ఉంటుంది.. కానీ ఎలా కంటిన్యూ చేయాలో తెలియనప్పుడు.. మనం ఓ కథ చెబుతున్నప్పుడు.. ఎవ్వరూ వినడం లేదని తెలిసినప్పుడు.. ఇక మెల్లిగా జారుకుని ఇంకెప్పుడూ చెప్పకుండా ఉంటాం..

మనం లెక్కను ఎంతో కష్ట‌పడి చేస్తాం.. కానీ ఇచ్చిన ఆప్షన్స్‌లో అది ఉండదు.. అంటూ ఇలా కొన్ని పరిస్థితుల్లో మనకు ఏదోలా అనిపిస్తుంటుంది.. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా ? అంటూ కళ్యాణ్ దేవ్ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. అసలు గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. దీంతో నెటిజన్లు కూడా రెచ్చిపోయి కథలు అల్లేస్తున్నారు. చూడాలి ఎవరు స్పందించి వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడతారో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి