---Advertisement---

Kajal Aggarwal Son Name : అప్పుడే పేరు పెట్టేశారు.. కాజ‌ల్ అగ‌ర్వాల్ కొడుకు పేరు ఏంటంటే..?

April 20, 2022 3:56 PM
---Advertisement---

Kajal Aggarwal Son Name : క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏప్రిల్ 19న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ బిడ్డ ఎలా ఉందో, తల్లిదండ్రులిద్దరిలో ఎవరి పోలికలతో ఉన్నాడో తెలుసుకోవాల‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అంతేకాదు కుమారుడికి ఏ పేరు పెడ‌తారు అని అంద‌రూ ఎదురు చూస్తున్న క్ర‌మంలో కాజల్ సోదరి బాబు పేరును రివీల్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. నిషా అగర్వాల్ కొత్త తల్లిదండ్రులను అభినందిస్తూ హృదయపూర్వక నోట్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌సికందు పేరును వెల్లడించింది. నీల్ కిచ్లు అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్టు తెలిపిన కాజ‌ల్ సోద‌రి.. ఆ చిన్నారి రాక‌తో మా ఇంట్లో ఆనందం రెట్టింపు అయింద‌ని తెలియ‌జేసింది.

Kajal Aggarwal Son Name revealed by her sister
Kajal Aggarwal Son Name

నీల్ కిచ్లు మా ప్ర‌పంచంలోకి వ‌చ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటూ నిషా అగ‌ర్వ‌ల్ స్ప‌ష్టం చేసింది. కాగా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా కాజ‌ల్ చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆమె భర్త గౌతమ్ కిచ్లుపై కామెంట్స్ చేస్తూ పెట్టిన పోస్ట్ లు వైరల్‌గా మారాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తనను గౌతమ్ ఎలా చూసుకుంటున్నాడనేది వివరంగా చెప్పింది కాజల్ అగర్వాల్.

తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని 2020 అక్టోబర్ లో కాజల్ అగర్వాల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలస్ హోటల్ లో వీరి వివాహం జరిగింది. ఇక కాజ‌ల్ పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేసింది. ఆమె న‌టించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది. అయితే ఇటీవ‌ల విడుద‌లైన ఆచార్య సినిమా ట్రైలర్‌ మంచి రెస్సాన్‌ను సొంతం చేసుకొన్నది. కాజల్ కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పూజా హెగ్డె కాస్తో కూస్తో ట్రైలర్ లో కనిపించింది. అయితే కాజల్ కనిపించకపోవడంపై రకరకాల ఊహాగానాలు వ‌స్తున్నాయి. మ‌రి సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now