Janhvi Kapoor : అందాల‌న్నీ ఆర‌బోస్తూ.. సందడి చేసిన జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!

October 29, 2021 6:53 PM

Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో పలు సినిమాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె పలు సినిమాలతో ఎంత బిజీగా ఉండటమే కాకుండా తనకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తోంది. ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Janhvi Kapoor new photos viral she seen at airport

తాజాగా జాన్వీకపూర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఆమె తాజాగా విమానాశ్రయంలో మీడియా కంట పడింది. ఈ క్రమంలోనే కెమెరాలు ఆమెను క్లిక్ మనిపించాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలలో పింక్ కలర్ లెగ్గిన్ వైట్ క్రాప్ టాప్ లో జాన్వీ కపూర్ తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఎలాంటి మేకప్ లేకుండా జాన్వీ కపూర్ ఎంతో సింపుల్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీకపూర్ గుడ్ లక్ జెర్రీ ఈ చిత్రాన్ని పూర్తి చేసుకోగా దోస్తానా 2, మిలి చిత్రాల షూటింగులతో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now