Janhvi Kapoor : తెలుపు రంగు డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న జాన్వీ క‌పూర్..!

June 25, 2022 8:48 PM

Janhvi Kapoor : అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ జాన్వీ క‌పూర్ త‌న‌కంటూ న‌టిగా ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె న‌టించిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రుస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఈమె సినీ ఇండ‌స్ట్రీలో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకుంటూనే వ‌స్తోంది. అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా జాన్వీ క‌పూర్‌కు అవ‌కాశాలు మాత్రం త‌గ్గలేదు. అలాగే న‌ట‌న‌లోనూ ఈమె మంచి మార్కుల‌నే కొట్టేసింది. ఈ క్ర‌మంలోనే జాన్వీ క‌పూర్ రేపో మాపో టాలీవుడ్‌లోకి కూడా అడుగు పెడుతుంద‌ని అంటున్నారు. అయితే ఈ వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ రావ‌డం లేదు. గ‌తంలోనే ఆమె తండ్రి బోనీక‌పూర్ ఈ విష‌యంపై పెద‌వి విప్పారు. కానీ అప్ప‌టి నుంచి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ లేదు.

జాన్వీక‌పూర్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతుంద‌ని ఎన్నో రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ అవ‌న్నీ పుకార్లే. అయితే త‌న త‌ల్లి శ్రీ‌దేవి మాత్రం ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ క‌పూర్‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని కోరింద‌ట‌. క‌నుక ఎన్‌టీఆర్ సినిమా ద్వారానే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని తెలుస్తోంది. ఇక జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అందులో ఫొటోల‌ను పోస్ట్ చేస్తోంది. అవ‌న్నీ ఎంతో ఆక‌ట్టుకునేలా ఉంటున్నాయి.

Janhvi Kapoor latest white color dress photos viral
Janhvi Kapoor

ఈ మ‌ధ్యే రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఫొటోషూట్ చేసిన జాన్వీ ఈసారి తెలుపు రంగు డ్రెస్‌లో అద‌ర‌గొట్టింది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఈమె చేసిన గ్లామ‌ర్ షోకు యువ‌త మైమ‌రిచిపోతున్నారు. ఆమె అందాల‌కు దాసోహం అంటున్నారు. ఈమె ఇలా గ్లామ‌ర్ దుస్తుల‌ను ధ‌రిస్తూ యువ‌త‌కు నిద్ర లేకుండా చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఆమె ఫొటోలు తెగ వైర‌ల్ అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే లేటెస్ట్ గా షేర్ చేసిన ఈ తెలుపు రంగు డ్రెస్ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఈమె ప్ర‌స్తుతం గుడ్ ల‌క్ జెర్రీ, మిలి, మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి, బ‌వాల్ అనే సినిమాల్లో న‌టిస్తోంది. ఇవ‌న్నీ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీలు రిలీజ్ కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment