Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఏంటి.. మ‌రీ ఇంత‌లా క‌నువిందు చేస్తోంది..!

July 21, 2022 8:54 PM

Janhvi Kapoor : అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది జాన్వీ క‌పూర్. ఈమెను, ఈమె సోద‌రి ఖుషి కపూర్‌ను శ్రీ‌దేవి స్టార్ హీరోయిన్లను చేయాల‌ని అనుకుంది. కానీ ఆమె కోరిక తీర‌కుండానే క‌న్ను మూసింది. అయిన‌ప్ప‌టికీ జాన్వీ మాత్రం న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె చేసిన సినిమాలు ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా హిట్ సాధించ‌లేదు. అయినా స‌రే న‌టిగా మంచి మార్కుల‌నే కొట్టేసింది. ఇక ఈ ముద్దు గుమ్మ సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు అందులో త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను ఈమె షేర్ చేస్తుంటుంది.

Janhvi Kapoor latest blue color photos viral
Janhvi Kapoor

తాజాగా జాన్వీ క‌పూర్ షేర్ చేసిన త‌న బ్లూ క‌ల‌ర్ డ్రెస్ ఫొటోలు మ‌తులు పోగొడుతున్నాయి. ఎద అందాల‌ను ప్ర‌దర్శిస్తూ ఈమ క‌నువిందు చేస్తోంది. దీంతో ఈమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. జాన్వీ క‌పూర్ అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ ఈమ‌ధ్య కాలంలో గ్లామ‌ర్ డోస్‌ను పెంచింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది.

జాన్వీ క‌పూర్ త‌న ఫిట్‌నెస్‌పై కూడా ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఈమె జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇక జాన్వీ క‌పూర్ తెలుగులోనూ అరంగేట్రం చేస్తుంద‌ని.. ఆమె కొరటాల‌, ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ గా ఎంపికైంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవి పుకార్లేన‌ని తెలుస్తోంది. అయితే జాన్వీ క‌పూర్‌కు అంత సీన్ లేద‌ని.. తెలుగులో ఈమెను చూసేవారు ఉండ‌ర‌ని ఈమ‌ధ్య కొన్ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. మ‌రి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కు ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now