Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. వేస‌విలో మ‌రింత హీట్ పెంచుతోంది..!

June 1, 2022 11:03 AM

Janhvi Kapoor : చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఈమెకు ఫాలోవ‌ర్లు మాత్రం అధిక సంఖ్య‌లో ఉన్నారు. అదేనండీ.. జాన్వీ క‌పూర్ గురించే ఇప్పుడు చెబుతోంది. ఈ అమ్మ‌డు న‌టిగా త‌నకంటూ ఓ గుర్తింపు పొందింది. కానీ ఈమె న‌టించిన చిత్రాలు ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా హిట్ కాలేదు. దీంతో మంచి హిట్ ఇచ్చే చిత్రం కోసం ఈమె ఎదురు చూస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్న జాన్వీ క‌పూర్ రోజు రోజుకీ మ‌రింత అందంగా క‌నిపిస్తోంది. ఒయ్యారాలు ఒల‌క‌బోస్తూ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

జాన్వీ క‌పూర్ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసి త‌ట్టుకోవ‌డం ఇక మా వ‌ల్ల కాద‌ని యువ‌త అంటున్నారు. శ్రీ‌దేవి కుమార్తెగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టినా.. న‌టిగా ఈమె మంచి మార్కుల‌నే కొట్టేసింది. అయితే అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో మాత్రం ఇత‌ర హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈమె వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ జాన్వీ అల‌రిస్తోంది.

Janhvi Kapoor busy with vacation
Janhvi Kapoor

జాన్వీ క‌పూర్ త‌న సోద‌రి ఖుషి క‌పూర్ బ‌ర్త్ డే వేడుక‌ల్లో అయితే పింక్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకుని మెరిసింది. అంద‌మంతా త‌న‌లోనే ఉన్న‌ట్లు క‌నిపించింది. ఇక ఇటీవ‌ల ఓ అవార్డ్స్ ఫంక్ష‌న్‌లోనూ భారీ ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ రెచ్చ‌గొట్టింది. దీంతో ఈ అమ్మ‌డి ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.

అయితే జాన్వీ క‌పూర్ షేర్ చేస్తున్న ఫొటోలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి ఉంటున్నాయి. దేనికదే ప్ర‌త్యేకంగా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఫొటోల‌ను చూసి కుర్ర‌కారు మైమ‌రిచిపోతున్నారు. తాజాగా జాన్వీక‌పూర్ మ‌ళ్లీ మెరిసింది.

ఇటీవ‌లే వెకేష‌న్‌కు వెళ్లిన జాన్వీ క‌పూర్ అక్క‌డ ప్ర‌కృతిలో తెగ ఎంజాయ్ చేస్తోంది. చుట్టూ ఉన్న ప్ర‌కృతికే అసూయ క‌లిగేలా ఈమె దుస్తుల‌ను ధ‌రించి గ్లామ‌ర్ షో చేసింది. వేస‌విలో అస‌లే వేడిగా ఉందంటే ఈమె త‌న ఫొటోల ద్వారా మ‌రింత హీట్ ను పెంచుతోంది.

ఇక జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతానికి హిందీలో ప‌లు సినిమాల‌తో బిజీగా ఉండ‌గా.. ఈమె త్వ‌ర‌లోనే టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతుంద‌ని అంటున్నారు. కానీ స‌రైన క‌థే ల‌భించ‌డం లేద‌ని తెలుస్తోంది. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న హీరోయిన్ గా ఈమె ఓ సినిమాకు ఎంపికైంద‌ని తెలుస్తోంది. కానీ దీని గురించి అధికారిక స‌మాచారం లేదు. త్వ‌ర‌లో దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now